English | Telugu

ఆలియా కూతురికి ఎవ‌రి పోలిక‌లు వచ్చాయో తెలుసా?

స్టార్ సెల‌బ్రిటీల పిల్ల‌ల మీద ఎప్పుడూ ఫోక‌స్ ఉంటూనే ఉంటుంది. నార్త్ లో అయితే పాప‌రాజీల దృష్టి మొత్తం స్టార్ కిడ్స్ మీదే ఉంటుంది. మొన్న‌మొన్న‌టిదాకా క‌రీనాక‌పూర్ రెండో కొడుకు తైమూర్ మీద ఈ స్పెష‌ల్ ఫోక‌స్ ఉండేది. ప్లీజ్ పిల్ల‌ల మీద అంత కాన్‌సెన్‌ట్రేట్ చేయ‌కండి అని కూడా క‌రీనా వేడుకున్న సంద‌ర్భాలున్నాయి. త్వ‌ర‌లోనే ఇలాంటి స్టేట్‌మెంట్లు ఆలియా నుంచి వింటామేమో అనిపిస్తోంది. ఇప్ప‌టికే ఆలియా కూతురు గురించి ఆరా తీయ‌డం మొద‌లుపెట్టేశారు జ‌నాలు. ఆలియా, ర‌ణ్‌బీర్ కూతురు ర‌హా గురించి నార్త్  మీడియాలో ఏదో ఒక న్యూస్ ఉంటూనే ఉంది. లేటెస్ట్ గా ర‌హాకి ఎవ‌రి పోలిక‌లు ఎక్కువున్నాయ‌నే దాని మీద డిస్క‌ష‌న్ జ‌రుగుతోంది. 

షారూక్ ‘ప‌ఠాన్’ ట్రైలర్ డేట్ ఫిక్స్

పూర్తి స్థాయి హీరోగా షారుఖ్‌ఖాన్ న‌టించిన సినిమా విడుద‌లై నాలుగున్న‌రేళ్ల‌యింది. ఆ క‌ర‌వంతా తీరేలా ప‌ఠాన్‌ని డిజైన్ చేశామ‌న్న‌ది షారుఖ్ ఈ మ‌ధ్య స్ట్రాంగ్‌గా చెబుతున్న మాట‌. ఈ నెల 10న రిలీజ్ అయ్యే ట్రైల‌ర్‌ని చూస్తే త‌న మాట‌ల్లో నిజ‌మేంటో అర్థ‌మ‌వుతుంద‌ని అన్నారు షారుఖ్‌. ఆయ‌న హీరోగా న‌టించిన సినిమా ప‌ఠాన్‌. య‌ష్‌రాజ్ ఫిల్మ్స్ నిర్మిస్తున్న సినిమా ప‌ఠాన్‌. ఆదిత్య చోప్రా నిర్మాత‌. సిద్ధార్థ్ ఆనంద్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. షారుఖ్ - దీపిక జోడీకి బాలీవుడ్‌లో స్పెష‌ల్ క్రేజ్ ఉంది. ఇప్పుడు ఈ సినిమాతో ఆ క్రేజ్ డ‌బుల్ అవుతుంద‌న్న‌ది సిద్ధార్థ్ ఆనంద్ చెబుతున్న మాట‌...