Read more!

English | Telugu

ఆలియాకి ఆస్కార్ మిస్ అయిందా?

ఆలియా న‌టించిన గంగూభాయ్ క‌తియావాడి మీద ప్ర‌శంస‌ల వ‌ర్షం కురిపించారు బ్రిటిష్ ఫిల్మ్ ఇన్‌స్టిట్యూట్ క్యురేట‌ర్ రాబిన్ బేక‌ర్‌. ఆమెను బ్రిటిష్ అకాడ‌మీ ఫిల్మ్ అవార్డుల‌కు, ఆస్కార్ అవార్డుల‌కు నామినేట్ చేయాల్సింద‌ని అన్నారు. తానుగ‌నుక స‌భ్యుల్లో ఉండి ఉంటే త‌ప్ప‌క ఆమె పేరును ఉత్త‌మ న‌టి కేట‌గిరీలో నామినేట్ చేసేవాడిన‌ని అన్నారు. సంజ‌య్‌లీలా భ‌న్సాలీ డైర‌క్ష‌న్‌లో విడుద‌లైంది గంగూభాయ్ క‌తియావాడి. వేశ్య నుంచి అండ‌ర్‌వ‌ర‌ల్డ్ బ్రోత‌ల్ మేడ‌మ్‌గా ఎదిగిన వ్య‌క్తికి సంబంధించిన క‌థ‌తో తెర‌కెక్కింది గంగూభాయ్ క‌తియావాడి. 

ఆలియా గురించి రాబిన్ బేక‌ర్ మాట్లాడుతూ ``ఈ సినిమా చాలా గొప్ప‌గా ఉంది. సెంటిమెంట్స్ ఉన్నాయి. ఎంజాయ్ చేసేలా ఉంది. సెన్సేష‌న‌ల్ స‌బ్జెక్ట్ తో తెర‌కెక్కించారు. క్లాసిక్ హిందీ సినిమాల రెఫ‌రెన్సులు అద్భుతంగా ఉన్నాయి. దేవానంద్ మీద గంగూభాయ్‌కి ఉన్న ప్రేమ‌, ఆ స‌న్నివేశాల‌ను, 50 - 60ల్లో వ‌చ్చిన సినిమాల పోస్ట‌ర్ల‌ను చూస్తుంటే అద్భుతంగా అనిపించింది. ముంబై రెడ్ లైట్ ఏరియాలోని జీవితాల‌ను క‌ళ్ల‌కు క‌ట్టిన‌ట్టు తెర‌కెక్కించారు. ఈ సినిమాను ఎవ‌రైనా చూడ‌ని వారుంటే త‌ప్ప‌కుండా చూడండి`` అంటూ స్పందించారు. ఆయ‌న పోస్టును షేర్ చేసిన ఆలియా భ‌ట్ హార్ట్ ఎమోజీల‌ను పోస్ట్ చేశారు. 

2023లోనూ ఆలియాకు వ‌రుస సినిమాలున్నాయి. 2022 ఆలియాభ‌ట్ కెరీర్‌లో మ‌ర్చిపోలేనిది. ఈ ఏడాది  ఆమె ట్రిపుల్ ఆర్‌లో న‌టించారు. బ్ర‌హ్మాస్త్ర సూప‌ర్ స‌క్సెస్ అయింది. ఆలియాకు ర‌ణ్‌బీర్‌తో  పెళ్ల‌యింది. ఈ దంప‌తులు పండంటి బిడ్డ ర‌హాకు జ‌న్మ‌నిచ్చింది కూడా 2022లోనే.