Read more!

English | Telugu

ఆ డైరెక్ట‌ర్‌తో ఫిక్స్ అయిన అభిషేక్‌!


అభిషేక్ ఇప్పుడు ఆచితూచి అడుగులు వేస్తున్నారు. అవ‌కాశాలు వ‌చ్చాయి క‌దా అని అన్నిటినీ ఒప్పుకోవ‌డం లేదు. ప‌ర్ఫెక్ట్ స్క్రిప్ట్ కోసం వెయిట్  చేస్తా అంటున్నారు. ఆ క్ర‌మంలోనే ఆయ‌న‌కు న‌చ్చిన స్క్రిప్ట్ దొరికింద‌ట‌. సూజిత్ సిర్కార్ డైర‌క్ష‌న్‌లో ఓ సినిమాకు సైన్ చేశారు అభిషేక్‌. విక్కీ డోనార్‌, మెడ్రాస్ కేఫ్‌, య‌హా, పీకూ సినిమాల‌తో తానేంటో ప్రూవ్ చేసుకున్నారు సూజిత్ సిర్కార్‌. అమితాబ్‌తో మంచి అసోసియేష‌న్ ఉంది సూజిత్‌కి. ఆయనతో షూబైట్‌, పీకూ, గులాబో సితాబో చేశారు. 

అభిషేక్‌, సూజిత్ ఇద్ద‌రూ క‌లిసి స‌మ‌యం దొరికిన‌ప్పుడ‌ల్లా ఫుట్‌బాల్ ఆడుతారు. అలా ఆట‌కోసం క‌లిసిన ప్ర‌తిసారీ ఏవో క‌థ‌ల‌ను డిస్క‌స్ చేసుకుంటూనే ఉంటార‌ట‌. ఇప్పుడు ఓ క‌థ‌ను ఫైన‌ల్ చేసేశార‌ట‌. స్క్రిప్ట్ డిస్క‌ష‌న్స్ ఫైన‌ల్ స్టేజ్‌లో ఉన్నాయి. లైఫ్ డ్రామాను తెర‌కెక్కించాల‌న్న ప్లాన్‌. ఈ ఏడాది సెకండ్ హాఫ్‌లో సెట్స్ మీద‌కు వెళ్తుంది. రోనీ లాహిరి ఈ సినిమాను నిర్మిస్తారు. 

జూనియ‌ర్ బ‌చ్చ‌న్ న‌టించిన 'బ్రీత్‌: ఇన్‌టు ద షాడోస్' సీజ‌న్‌2కి మంచి స్పందన వ‌స్తోంది. ఆర్ బాల్కీ 'ఘూమ‌ర్‌'లో న‌టిస్తున్నారు. ఈ సినిమాలో ష‌బానా ఆజ్మీ, స‌యామీ ఖేర్‌, అంగ‌ద్ బేడీ, శివేంద్ర సింగ్ దుంగ‌ర్పుర్ కీల‌క పాత్ర‌ల్లో న‌టిస్తున్నారు. అమితాబ్ బ‌చ్చ‌న్ కూడా ఇందులో ప్ర‌త్యేక పాత్ర చేస్తున్నారు. అమితాబ్ బ‌చ్చ‌న్‌కి గెస్ట్ రోల్స్ కొత్తేం కాదు. చీనీ క‌మ్‌, పా, ఇంగ్లిష్ వింగ్లిష్‌, ష‌మితాబ్‌, కి అండ్ కా, పాడ్‌మ్యాన్, చుప్‌లో న‌టించారు. అభిషేక్ కూడా అజ‌య్‌దేవ్‌గ‌ణ్ 'బోళా'లో స్పెష‌ల్ అప్పియ‌రెన్స్ ఇచ్చారు. అమితాబ్‌, అభిషేక్ క‌లిసి 'పా', 'బంటీ ఔర్ బ‌బ్లీ', 'స‌ర్కార్‌'తో పాటు ప‌లు సినిమాల్లో న‌టించారు.