Read more!

English | Telugu

అమితాబ్ మ‌న‌వ‌డిని షారుఖ్ కూతురు ఇష్ట‌ప‌డుతోందా?

ముంబై మీడియాలో టాప్‌లో ట్రెండ్ అవుతున్న వార్త ఏంటో తెలుసా? అమితాబ్ బ‌చ్చ‌న్ మ‌న‌వ‌డు (కూతురు కొడుకు) అగ‌స్త్య నందాతో షారుఖ్ త‌న‌య సుహానా ఖాన్ ప్రేమలో ప‌డింది అని. వారిద్ద‌రి డేటింగ్ గురించే వార్త‌లు న‌డుస్తున్నాయి. జోయా అఖ్తర్ ద‌ర్శ‌క‌త్వంలో వీరిద్ద‌రూ క‌లిసి 'ది ఆర్చీస్‌'లో న‌టిస్తున్నారు. ఈ సెట్లోనే సుహానా, అగ‌స్త్య స‌న్నిహితంగా ఉంటున్నార‌ట‌. వారిద్ద‌రి మ‌ధ్య క్లోజ్‌నెస్ చూసిన వారికి ఎవ‌రికైనా ఇద్ద‌రూ రిలేష‌న్‌షిప్‌లో ఉన్నార‌నే విష‌యం అర్థ‌మ‌వుతుంద‌ట‌. 

త‌న తండ్రి త‌ర‌ఫు బంధువులు క‌పూర్స్ కి, సుహానాని త‌న పార్టనర్‌గా ప‌రిచ‌యం చేశాడట అగస్త్య‌. అమితాబ్ కూతురు శ్వేత‌బ‌చ్చ‌న్ నందా కూడా వీరిద్ద‌రి రిలేష‌న్‌షిప్‌కి ప‌చ్చ‌జెండా ఊపార‌ని వినికిడి. ఈ విష‌యం బ‌య‌ట‌కు రాగానే ఫ్యాన్స్ పేజీల్లో బ్యూటీఫుల్ లుకింగ్ అంటూ హార్ట్ ఎమోజీలు ప్ర‌త్య‌క్ష‌మ‌య్యాయి. మ‌రికొంద‌రు మాత్రం, 'ఇది 'ఆర్చీస్' సినిమా ప‌బ్లిసిటీ స్టంట్‌. ఇలాంటివాటిని ఎన్నిటిన చూడ‌లేదూ... బాలీవుడ్ వాళ్లు సినిమాను అమ్ముకోవ‌డానికి ముందు ఇలాంటి చీప్ ప‌బ్లిసిటీ చేస్తుంటారు' అంటూ పెద‌వి విరుస్తున్నారు. సినిమాను చూస్తాంలే గానీ, ముందు ఆ డేటింగ్ రూమ‌ర్స్ కి చెక్ పెట్టండి బాబూ అనేవాళ్లూ లేక‌పోలేదు. 

జోయా అఖ్తర్ సినిమా 'ది ఆర్చీస్‌'తో సుహానా, అగ‌స్త్య సిల్వ‌ర్‌స్క్రీన్‌కి ప‌రిచ‌యం కాబోతున్నారు. శ్రీదేవి చిన్న కూతురు ఖుషీ క‌పూర్ కూడా ఈ సినిమాతోనే సిల్వ‌ర్ స్క్రీన్ ఎంట్రీ ఇస్తున్నారు. ఈ మూవీని టైగ‌ర్ బేబీ ఫిల్మ్స్, గ్రాఫిక్ ఇండియా అండ్ ఆర్చీస్ కామిక్స్ క‌లిసి నిర్మిస్తున్నాయి. ఈ సినిమాను ఓటీటీలో విడుద‌ల చేయ‌నున్నారు.