Read more!

English | Telugu

ఆలియా కూతురికి ఎవ‌రి పోలిక‌లు వచ్చాయో తెలుసా?

స్టార్ సెల‌బ్రిటీల పిల్ల‌ల మీద ఎప్పుడూ ఫోక‌స్ ఉంటూనే ఉంటుంది. నార్త్ లో అయితే పాప‌రాజీల దృష్టి మొత్తం స్టార్ కిడ్స్ మీదే ఉంటుంది. మొన్న‌మొన్న‌టిదాకా క‌రీనాక‌పూర్ రెండో కొడుకు తైమూర్ మీద ఈ స్పెష‌ల్ ఫోక‌స్ ఉండేది. ప్లీజ్ పిల్ల‌ల మీద అంత కాన్‌సెన్‌ట్రేట్ చేయ‌కండి అని కూడా క‌రీనా వేడుకున్న సంద‌ర్భాలున్నాయి. త్వ‌ర‌లోనే ఇలాంటి స్టేట్‌మెంట్లు ఆలియా నుంచి వింటామేమో అనిపిస్తోంది. ఇప్ప‌టికే ఆలియా కూతురు గురించి ఆరా తీయ‌డం మొద‌లుపెట్టేశారు జ‌నాలు. ఆలియా, ర‌ణ్‌బీర్ కూతురు ర‌హా గురించి నార్త్  మీడియాలో ఏదో ఒక న్యూస్ ఉంటూనే ఉంది. లేటెస్ట్ గా ర‌హాకి ఎవ‌రి పోలిక‌లు ఎక్కువున్నాయ‌నే దాని మీద డిస్క‌ష‌న్ జ‌రుగుతోంది. 

ఆలియా ఏమో త‌న‌లాగే ఉంది కూతురు అని అంటున్నార‌ట‌. క‌పూర్ జీన్స్ అన్నీ ర‌హాలో క‌నిపిస్తున్నాయ‌ని నియ‌ర్ అండ్ డియ‌ర్స్ తో ర‌ణ్‌బీర్ చెబుతున్నార‌ట‌. ర‌హా చాలా క్యూట్‌గా ఉంటుంద‌ని, రాత్రిళ్లు బుద్ధిగా నిద్ర‌పోతోంద‌ని, వాళ్ల‌మ్మ‌ని కూడా నిద్ర పోనిస్తోంద‌ని, ఈ క్వాలిటీకి ఇంట్లో జ‌నాలంద‌రూ ముచ్చ‌ట‌ ప‌డిపోతున్నార‌ని అంటున్నారు ద‌గ్గ‌రి బంధువులు. ఆలియా, ర‌ణ్‌బీర్ ఇద్ద‌రి పోలిక‌లూ ర‌హాలో స్ప‌ష్టంగా క‌నిపిస్తున్నాయ‌ని కేర్ టేక‌ర్స్ చెబుతున్న మాట‌. కూతురు పుట్టిన రెండు నెల‌ల్లోనే ఆలియా జిమ్‌కి వెళ్తున్నారు. 

త‌న భ‌ర్త ర‌ణబీర్‌తో క‌లిసి ఆలియా త్వ‌ర‌లోనే బ్ర‌హ్మాస్త్ర2 షూట్‌కి వెళ్ల‌డానికి ప్లాన్  చేసుకుంటున్నారు. మ‌రోవైపు క‌ర‌ణ్‌జోహార్ సినిమా ప్ర‌మోష‌న్ల‌కు కూడా హాజ‌రు కావాల్సి ఉంది. ర‌ణ‌బీర్ ప్ర‌స్తుతం సందీప్‌రెడ్డి వంగా ద‌ర్శ‌క‌త్వంలో యానిమ‌ల్‌లో న‌టిస్తున్నారు. న్యూ ఇయ‌ర్ సంద‌ర్భంగా రిలీజైన యానిమ‌ల్ పోస్ట‌ర్‌కి మంచి రెస్పాన్స్ వ‌స్తోంది. నెవ‌ర్ బిఫోర్ సీన్ అవ‌తార్‌లో న‌టిస్తున్నారు ర‌ణ‌బీర్‌.