Read more!

English | Telugu

మ‌న హీరోల‌ని వెన‌క్కి నెట్టిన షారుఖ్‌

ఇండ‌స్ట్రీలో ఉన్న కాంట్ర‌వ‌ర్శీల‌ను, క్రేజ్‌ని, బాయ్‌కాట్ సెగ‌ల‌ను, వెయిటింగ్ అనే ప‌దాల‌ను అన్నిటినీ ఏలుతున్నారు షారుఖ్‌ఖాన్‌. వీట‌న్నిటికీ రీజ‌న్ ఆయ‌న సినిమా ప‌ఠాన్ రిలీజ్‌కి ఉండ‌ట‌మే. ఎన్నాళ్లుగానో బాద్షా ఫ్యాన్స్ వెయిట్ చేస్తున్న ప‌ఠాన్ రిలీజ్ ఈ నెల 25న ఉంది.  ఈ సినిమాలోని బేష‌ర‌మ్ రంగ్ సాంగ్ ఇప్ప‌టికే జ‌నాల‌ను మెస్మ‌రైజ్ చేసింది. దీపిక ప‌దుకోన్ హొయ‌ల‌కు కుర్ర‌కారు ఫిదా అవుతుంటే, షారుఖ్ ఫిజిక్ చూసి ఫిట్‌నెస్ ఫ్రీక్స్ వావ్ అంటున్నారు. వాళ్లిద్ద‌రి కెమిస్ట్రీ అదుర్స్ అంటున్నారు మూవీ ల‌వ‌ర్స్.ఈ సినిమా మీద ఉన్న క్రేజ్ అలాంటిది మ‌రి. అందుకే ఐఎండీబీ 2023 మోస్ట్ ఎవెయిటింగ్ లిస్టులో నేష‌న‌ల్ వైడ్ ఫ‌స్ల్ ప్లేస్ కొట్టేశారు షారుఖ్‌ఖాన్‌.

మ‌న లారీ డ్రైవ‌ర్ పుష్ప‌రాజ్‌ది సెకండ్ ప్లేస్‌. అనూహ్యంగా బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చేసి, అక్క‌డ ఖ‌జానాని కొల్ల‌గొట్టిన గంధ‌పు చ‌క్క‌ల స్మ‌గ్ల‌ర్ పుష్ప‌రాజ్‌. గ‌ళ్ల లుంగీ, నోట్లో యాల‌కులు, మాస్ లుక్‌, చింపిరి జుట్టుతో ఇండియ‌న్ బాక్సాఫీస్ ని ఏలేశారు పుష్ప‌. ఇప్పుడు ఆ త‌గ్గేదేలే మేన‌రిజ‌మ్‌కి అల‌వాటు పడ్డారు జ‌నాలు. అందుకే త‌గ్గేదేలే అంటూ పుష్ప‌2 కోసం వెయిట్ చేస్తున్నారు. ఈ లిస్టులో థ‌ర్డ్ ప్లేస్‌లో ఉంది జ‌వాన్‌. అట్లీ ద‌ర్శ‌క‌త్వంలో షారుఖ్ న‌టిస్తున్న సినిమా జ‌వాన్‌. న‌య‌న‌తార‌కి బాలీవుడ్ ఎంట్రీ ఈ మూవీతోనే. అట్లీ డైర‌క్ష‌న్‌లో విజ‌య్ సేతుప‌తి కీ రోల్ చేస్తున్నారు. ఈ సినిమా కోసం కూడా ఉత్త‌రాది జ‌నాల‌తో పాటు ద‌క్షిణాది వాళ్లు వెయిటింగ్. 

ఇక మ‌న బాహుబ‌లి ప్ర‌భాస్ రెండు సినిమాలు కూడా ఈ లిస్టులో ఉన్నాయి. ప్ర‌భాస్ న‌టించిన ఆదిపురుష్ కోసం నార్త్ జ‌నాలు వెయిట్ చేస్తున్నారు. స‌లార్ మీద కూడా అంతే కాన్‌సెన్‌ట్రేష‌న్ ఉంది వాళ్ల‌ల్లో. ఆల్రెడీ కేజీయ‌ఫ్‌2 క్రియేట్ చేసిన వైబ్స్ ఇప్పుడు స‌లార్‌కి ప్ల‌స్ అవుతున్నాయి.