Read more!

English | Telugu

షారుఖ్ మ‌న‌సు బంగారం అంటున్న ఫ్యాన్స్...

బాలీవుడ్ బిగ్గెస్ట్ స్టార్స్ లో షారుఖ్ ఒక‌రు. ప్ర‌పంచ‌వ్యాప్తంగా ఫ్యాన్స్ ఉన్న న‌టుడు షారుఖ్‌. ఎస్ ఆర్ కె ఇయ‌న్స్ అంటూ త‌మ‌కు తాము నామ‌క‌ర‌ణం కూడా చేసుకున్నారు. షారుఖ్‌, దీపిక‌, జాన్ అబ్ర‌హామ్ న‌టించిన ప‌ఠాన్ కోసం చాలా ఈగ‌ర్‌గా వెయిట్ చేస్తున్నారు. షారుఖ్ హీరోగా న‌టించిన జీరో ఆయ‌న‌కు పూర్తి స్థాయి సినిమా. ఆ త‌ర్వాత కొన్ని సినిమాలు చేసినా అవి జ‌స్ట్ గెస్ట్ అప్పియ‌రెన్స్‌లు మాత్ర‌మే. 

ప‌ఠాన్ రిలీజ్ కోసం అభిమానులు వెయిట్‌చేస్తుంటే, అంత‌క‌న్నా గొప్ప ప‌ని చేసి ఫ్యాన్స్ తో శ‌భాష్ అనిపించుకుంటున్నారు షారుఖ్‌. ఢిల్లీ యాక్సిడెంట్ విక్టిమ్ అంజ‌లి సింగ్‌కి షారుఖ్ మీర్ ఫౌండేష‌న్ త‌ర‌ఫున స‌హాయం అందింది. అంజ‌లి సింగ్ తోబుట్టువుల‌కు, ఆమె త‌ల్లికి పెద్ద మొత్తంలో షారుఖ్ స‌హాయం చేశార‌ట‌. ఈ విష‌యం తెలిసి షారుఖ్ ఖాన్ మంచిత‌నం గురించి ట్విట్ట‌ర్‌లో ట్రెండ్ చేస్తున్నారు జ‌నాలు. పీఎం కేర్స్ ఫండ్‌, మ‌హ‌రాష్ట్ర సీఎం ఫండ్‌, పీపీఈ ఫ‌ర్ హెల్త్ కేర్ ప్రొవైడ‌ర్స్, ఏక్ సాత్ - ది ఎర్త్ ఫౌండేష‌న్‌, రోటీ ఫౌండేష‌న్‌, వ‌ర్కింగ్ ఫార్ పీపుల్స్ చార్ట‌ర్‌, స‌పోర్ట్ ఫ‌ర్ యాసిడ్ అటాక్ స‌ర్వైవ‌ర్స్ అంటూ షారుఖ్ చేసిన సాయం గురించి మ‌రొక్క‌సారి వైర‌ల్ చేస్తున్నారు ఆయ‌న ఫ్యాన్స్. మోస్ట్ చారిట‌బుల్ యాక్ట‌ర్ అంటూ రీట్వీటులు కూడా గ‌ట్టిగానే అవుతున్నాయి.

ఇదిలా ఉండ‌గా ప‌ఠాన్ మీద కూడా ఫోక‌స్ పెరుగుతోంది. రీసెంట్‌గా ప‌ఠాన్ సెన్సార్ పూర్త‌యింది. యు/ఎ ఇచ్చింది సెన్సార్ బోర్డు. ప‌దికి పైగా క‌ట్లు చెప్పిన‌ట్టు స‌మాచారం. ఇప్పుడు బేష‌రం సాంగ్ సినిమాలో ఉంటుందా? ఉండ‌దా? ఉంటే ఏ షాట్‌లుంటాయి? ఏవి ఉండ‌వు? అనే చ‌ర్చ కూడా గ‌ట్టిగానే జ‌రుగుతోంది.ఈ ఏడాది మూడు సినిమ‌ల‌తో ప్రేక్ష‌కుల‌ను ప‌ల‌క‌రించ‌బోతున్నారు షారుఖ్‌. జ‌న‌వ‌రిలో ప‌ఠాన్‌, ఏడాది మ‌ధ్య‌లో జ‌వాన్‌, ఏడాది చివ‌ర‌న డంకీ సినిమాల‌ను రిలీజ్ చేస్తున్నారు షారుఖ్‌. త‌మ అభిమాన న‌టుడికి ఈ ఏడాది హ్యాట్రిక్ హిట్లు ఖాయం అంటున్నారు ఫ్యాన్స్.