Read more!

English | Telugu

అంబానీ ఇంట్లోకి ఆ ఒక్క హీరోకి మాత్రమే ఎంట్రీ!

మ‌న‌కి సినిమా న‌టులంటే ఏదో గొప్ప‌వారు, ఆకాశం నుంచి ఊడిప‌డిన వార‌నే భావ‌న ఉంటుంది. కానీ వారు మాత్రం బ‌డా బడా పారిశ్రామిక వేత్త‌లు, అత్యంత ధ‌న‌వంతుల ముందు క్యూలో నిల‌బ‌డ‌తారు. వారు పిలిచిన‌ప్పుడు వెళ్లి, వాళ్ల ఇళ్ల‌లో జ‌రిగే వేడుక‌లు, ఇత‌ర కార్య‌క్ర‌మాల‌కు అతిథుల ముందు డ్యాన్స్‌లు వేసి ఎంటర్‌టైన్ చేస్తుంటారు. ఈ జాబితాలోకి బ‌డా పారిశ్రామిక‌వేత్త‌లు, అత్యంత ధ‌న‌వంతులు, రాజ‌కీయ నాయ‌కులు, ఇత‌ర ప్ర‌ముఖుల‌తో పాటు మాఫియా డాన్ల వంటి వారిని కూడా చెప్పుకోవాలి.

ఒక‌నాడు షార్జాలో క్రికెట్ మ్యాచ్‌లు జ‌రిగే స‌మ‌యంలో బాలీవుడ్ హీరో హీరోయిన్లందరు అక్క‌డ వాలిపోయేవారు. ఆ మ్యాచ్‌ల‌కు మాఫియా డాన్ దావూద్ ఇబ్ర‌హీం కూడా అధికారికంగా హాజ‌ర‌య్యేవాడు. మ్యాచ్ అయిపోయిన త‌ర్వాత పాకిస్తాన్ క్రికెట‌ర్ల‌కు దావూద్ పార్టీ ఇచ్చి మ‌న బాలీవుడ్ హీరో హీరోయిన్ల చేత వారికి మ‌ద్యం స‌ర‌ఫ‌రా చేసి, వారి ముందు సినిమా వారి చేత డ్యాన్స్‌లు గ‌ట్రా చేయించి వారిని ఎంట‌ర్టైన్ చేసేవాడు. ఆయ‌న హ‌వా నాడు అలా ఉండేది. 

ఇక విష‌యానికి వ‌స్తే.. దేశంలోనే అత్యంత ధనవంతుల జాబితాలో ముఖేశ్ అంబానీ పేరు ముందుగా చెప్పుకోవాలి. ఆ తరువాత అదానీలు, మిగతా అందరూ వస్తారు. అంబానీల విలాస‌వంతమైన గృహం 'ఎంటీలియా' గురించి వర్ణించాలంటే సామాన్యంగాదు. ముంబైలోని ఆకాశ హార్మ్యాలను తలదన్నే ఎంటీలియా ఆ నగరానికి తలమానికం. ఇది కేవలం ముంబైకే కాదు, దేశంలోనే అత్యంత ఖరీదైన భవనం. ఈ భవనంలోని పై అంతస్తులో రెండు అంతస్తులు పూర్తిగా కార్ల పార్కింగ్‌కు కేటాయించారు. అలాంటి చోట కారుని పార్క్‌ చేయాలంటే చిన్న విష‌యం కాదు. ఎంద‌రు ప్ర‌ముఖులు అంబానీ ఇంటికి వ‌చ్చినా బ‌య‌టే కారును పార్క్ చేయాలి. ఎంటీలియాలో పార్క్ చేయ‌డానికి వీలు లేదు.

సెలబ్రిటీలంతా గ్రేట్ బిజినెస్ మాన్ కంటపడాలని, మెప్పు పొందాలని ఆరాటపడుతూ ఉంటారు. కానీ అవకాశం అందరికీ వస్తుందంటే రాదు. అంబానీల‌తో సన్నిహితంగా ఉండగలిగే ఒకరిద్దరికి మాత్రమే ఆ అరుదైన అవకాశం ఉంటుంది. అలాంటి వారిలో కింగ్ ఖాన్ షారుక్ ఖాన్ పేరు  ప్రముఖంగా వినిపిస్తుంది. బాలీవుడ్ మీడియా కథనాలు ప్రకారం అంబానీ వారసుడు అనంత్ అంబానీ, ప్రముఖ ఫార్మా కంపెనీ సీఈవో కుమార్తె రాధిక వ్యాపారి నిశ్చితార్థ వేడుక అనంతరం ప్రత్యేక అతిధి అయిన షారుఖ్ ఖాన్ కి త‌న కారుని ఎంటీలియాలో పార్క్ చేసుకునే అవ‌కాశం ల‌భించింది.

ముఖేష్, అనిల్ అంబానీలతో షారుఖ్ కి మంచి సాన్నిహిత్యం ఉంది.  ఖాన్ త్ర‌యంలోని షారుఖ్‌, స‌ల్మాన్, ఆమిర్.. ముగ్గురికి అంబానీల‌తో క్లోజ్ నెస్ ఉంది. కానీ తాజా వేడుక‌ల్లో కేవ‌లం షారుఖ్ సంద‌డి మాత్ర‌మే క‌నిపించింద‌ని బాలీవుడ్ మీడియాలో క‌థ‌నాలు వ‌స్తున్నాయి. ఇంటర్నెట్‌లో ఈ ఫోటోలు, వీడియోలు వైరల్ అవుతున్నాయి. వీటిని వీక్షిస్తే సెలబ్రిటీల ప్రత్యేక ఆసక్తి, శ్రద్ధ బయటపడతాయి. ఒక మహా సామ్రాజ్యంలో చక్రవర్తి ముందు నిలబడే సామంత రాజుల‌లాగా  బాలీవుడ్ స్టార్స్ అంబానీల ముందు అణిగిమణిగి క‌నిపిస్తున్నారు. చాలామంది స్టార్స్ లోనికి వెళ్తున్నా కానీ ముఖం కనిపించని ఒకే ఒక నటుడు కింగ్ ఖాన్  షారుక్ ఖాన్. అతడి కారును అభిమానులు గుర్తుపట్టేశారు.

షారుక్ ప్రస్తుతం 'జవాన్' సినిమా షూటింగ్‌లో ఉన్నందున తన లుక్ ను పూర్తిగా బయటపడకుండా చేశారు.  సూపర్ స్టార్ షారుక్ ఖాన్ కి అంబానీలు ఇచ్చిన ఈ ప్రత్యేక ట్రీట్మెంట్ పై రకరకాల ఊహాగానాలు సాగుతున్నాయి. కింగ్ ఖాన్ తో పాటు భాయ్ సల్మాన్ ఖాన్ వచ్చినా చాలా సింపుల్‌గా నడుచుకుంటూ ఎంటీలియాలోకి వెళ్లిపోయారు. కానీ షారుక్ మాత్రం కారును లోనికి పోనిచ్చాడని ప్రముఖ జాతీయ మీడియాలో కథనాలు  వెలువడుతున్నాయి... దాంతో ప్ర‌స్తుతం ఇది హాట్ టాపిక్ గా మారింది...!