Read more!

English | Telugu

షారూక్ ‘ప‌ఠాన్’ ట్రైలర్ డేట్ ఫిక్స్

పూర్తి స్థాయి హీరోగా షారుఖ్‌ఖాన్ న‌టించిన సినిమా విడుద‌లై నాలుగున్న‌రేళ్ల‌యింది. ఆ క‌ర‌వంతా తీరేలా ప‌ఠాన్‌ని డిజైన్ చేశామ‌న్న‌ది షారుఖ్ ఈ మ‌ధ్య స్ట్రాంగ్‌గా చెబుతున్న మాట‌. ఈ నెల 10న రిలీజ్ అయ్యే ట్రైల‌ర్‌ని చూస్తే త‌న మాట‌ల్లో నిజ‌మేంటో అర్థ‌మ‌వుతుంద‌ని అన్నారు షారుఖ్‌. ఆయ‌న హీరోగా న‌టించిన సినిమా ప‌ఠాన్‌. య‌ష్‌రాజ్ ఫిల్మ్స్ నిర్మిస్తున్న సినిమా ప‌ఠాన్‌. ఆదిత్య చోప్రా నిర్మాత‌. సిద్ధార్థ్ ఆనంద్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. షారుఖ్ - దీపిక జోడీకి బాలీవుడ్‌లో స్పెష‌ల్ క్రేజ్ ఉంది. ఇప్పుడు ఈ సినిమాతో ఆ క్రేజ్ డ‌బుల్ అవుతుంద‌న్న‌ది సిద్ధార్థ్ ఆనంద్ చెబుతున్న మాట‌.

ఆల్రెడీ రెండు పాట‌ల‌ను విడుద‌ల చేశారు. స్పై థ్రిల్ల‌ర్ మూవీ ఇది. వెన్నులో వ‌ణుకు పుట్టించే యాక్ష‌న్ స‌న్నివేశాలను షూట్ చేశారు. ఫ‌స్ట్ కాపీని సెన్సార్ బోర్డుకు కూడా పంపారు మేక‌ర్స్. అయితే సినిమాలో ప‌లు మార్పులు సూచించి, అవి చేసుకుని వ‌చ్చాకే సెన్సార్ చేస్తామ‌ని చెప్పారట‌. ఇప్ప‌డు మేక‌ర్స్ ఆ ప‌నుల్లో ఉన్నారు. త్వ‌ర‌లోనే మ‌రోసారి సెన్సార్‌కి సినిమాను స‌బ్మిట్ చేస్తారు.

ప‌ఠాన్ మూవీ నుంచి బేష‌ర‌మ్ రంగ్ సాంగ్‌ని సినిమా  నుంచి తీసేయాల‌ని, ఇందులో దీపిక ప‌దుకోన్ వేసుకున్న వ‌స్త్రాలు అభ్యంత‌ర‌క‌రంగా ఉన్నాయని, ఆ దుస్తుల రంగులు కూడా మ‌నోభావాల‌ను దెబ్బ‌తీస్తున్నాయ‌నే వాద‌న‌లు వినిపిస్తున్నాయి. వీటి మీద చిత్ర యూనిట్ ఎలా స్పందిస్తుందో చూడాలి.

షారుఖ్ ఖాన్ సినిమాల‌కు సౌత్‌లోనూ మంచి క‌లెక్ష‌న్లు వ‌స్తుంటాయి. పైగా ఇప్పుడు దీపిక ప్రాజెక్ట్ కెతో తెలుగు ఎంట్రీ ఇస్తున్నారు. సౌత్ మార్కెట్‌ని కూడా కేప్చ‌ర్ చేసేలా ఈ సినిమాను హిందీ, తెలుగు, త‌మిళ్‌లో రిలీజ్ చేస్తోంది య‌ష్‌రాజ్ ఫిల్మ్స్. ఈ నెల 25న విడుద‌ల కానుంది ప‌ఠాన్‌.