Read more!

English | Telugu

ఏదో ఒక ఎక్స‌ర్‌సైజ్ చేయ‌మంటున్న టైగ‌ర్‌

బాలీవుడ్ యాక్ట‌ర్‌, ఫిట్‌నెస్ ఫ్రీక్ టైగ‌ర్‌ ష్రాఫ్ కొన్ని టిప్స్ చెబుతున్నారు. తాను ఫిట్‌నెస్ గురించి ఉప‌న్యాసాలు ఇవ్వ‌ద‌ల‌చుకోలేద‌ని అంటూనే చాలా విష‌యాల‌ను పంచుకున్నారు. అంద‌రూ ఒక‌టే చేయాల‌నేం లేదు, ఎవ‌రికి తోచిన ఎక్స‌ర్‌సైజ్‌లు వాళ్లు చేసుకోవాల‌ని చెప్పారు. 24 గంట‌ల్లో క‌నీసం అర‌గంట‌ను శ‌రీరానికి కేటాయించ‌మ‌ని అన్నారు. ఫిట్‌నెస్ వ‌ల్ల మ‌న‌సు కూడా ప్ర‌శాంతంగా ఉంటుంద‌ని చెప్పారు. ఒళ్లు క‌ద‌ల‌డం వ‌ల్ల లైఫ్‌స్టైల్‌లో పెద్ద మార్పును గ‌మ‌నించ‌వ‌చ్చ‌ని చెప్పారు. 

'వార్‌2'లో హృతిక్ రోష‌న్‌తో కలిసి న‌టించాల‌ని ఉంద‌ని చెప్పారు టైగ‌ర్‌. అంద‌రూ గ్రీక్ గాడ్ అని పిలుచుకునే హృతిక్ రోష‌న్ ని చూస్తూ పెరిగాన‌ని, ఇప్ప‌టికీ అత‌ని మీద అంతే గౌర‌వం ఉంద‌ని, అత‌న్ని చూసి చాలా నేర్చుకున్నాన‌ని తెలిపారు టైగ‌ర్‌. 2023లో త‌న సినిమాలు రెండు విడుద‌ల‌వుతున్నాయ‌ని అన్నారు. గ‌తంతో పోలిస్తే ఈ ఏడాది ప్ర‌మోష‌న్ల‌లోనూ కాస్త ఎక్కువ‌గానే క‌నిపిస్తాన‌ని అన్నారు జూనియ‌ర్ ష్రాఫ్‌. 

ప్ర‌స్తుతం అక్ష‌య్‌కుమార్‌తో క‌లిసి 'బ‌డేమియా చోటేమియా'లో న‌టిస్తున్నారు టైగ‌ర్ ష్రాఫ్‌. త్వ‌ర‌లోనే ఈ సినిమా షెడ్యూల్ ముంబైలో మొద‌లుకానుంది. ముంబై య‌ష్‌రాజ్ స్టూడియోలో ట‌న‌ల్ సెట్ వేస్తున్నారు. అక్క‌డ మెయిన్ షెడ్యూల్ పూర్త‌య్యాక యూరోప్ కంట్రీస్‌లో మిగిలిన షెడ్యూల్స్ ప్లాన్ చేశారు మేక‌ర్స్.