English | Telugu
`కార్తీక దీపం` డైరెక్టర్ కు జనం శాపనార్ధాలు
Updated : Mar 8, 2022
బుల్లితెరపై ప్రసారం అవుతున్న సీరియల్ `కార్తీక దీపం`. గత కొంత కాలం క్రితం టాప్ లో ట్రెండ్ అయిన ఈ సీరియల్ ప్రస్తుతం పతనావస్థకు చేరుకుంది. తెలుగు సీరియల్స్ లలో టాప్ రేటింగ్ ని సాధించిన ఇండియా వైడ్ గా ట్రెండ్ అయిన ఈ సీరియల్ గత కొంత కాలంగా గాడి తప్పి అవస్థలు పడుతోంది. సాగదీత ధోరణితో ఎపిసోడ్ లని డైరెక్టర్ ఎప్పటికప్పుడు సాగదీస్తూరు వున్నాడు. దీంతో ఆదరించిన వారే ఈ సీరియల్ పై సెటైర్లు వేయడం మొదలైంది. దీంతో టాప్ లో వున్న సీరియల్ కాస్తా కిందపడిపోయింది.
డాక్టర్ బాబు, వంటలక్క కలిస్తే బాగుండు అనుకుంటూ ఆసక్తిగా ఎదురుచూస్తున్న వారికి గుడ్ న్యూస్ చెప్పిన డైరెక్టర్ కాపుగంటి రాజేంద్ర అక్కడి నుంచే సీరియల్ ని గాడి తప్పించాడు. దీంతో ఆసక్తి పూర్తిగా పోయింది. ఎలా నడిపించాలో అర్థం కాక తనకు తోచినట్టుగా నడిపించడం మొదలుపెట్టాడు అదే ఈ సీరియల్ పతనానికి ప్రధాన కారణంగా మారింది. ఫ్యామిలీకి డాక్టర్ బాబు, దీపలని దూరం చేసి నడిపించిన డైరెక్టర్ ఆ తరువాత మళ్లీ కలిపి ముందుకు సాగించాలనుకున్నాడు. అయితే ఆసక్తి పోయింది.
Also Read:అతడితో మరోసారి నయన్ రొమాన్స్!
ఇప్పుడు ఉన్నట్టుండి డాక్టర్ బాబు, దీప, హిమల క్యారెక్టర్ లని ఎండ్ చేసేశాడు. చిక్‌మంగళూర్ ఎపిసోడ్ అంటూ మొదలుపెట్టి అక్కడే హిమ అత్యుత్సాహం కారణంగా కారు యాక్సిడెంట్ కి గురికావడం.. ఈ ముగ్గురితో సహా లోయలో పడి పేలిపోవడం చూపించారు. కట్ చేస్తే ఈ ముగ్గురి ఫొటోలకి దండేయడంతో షాక్ కు గురైన వీక్షకులు, మహిళా ప్రేక్షకులు ఇప్పుడు డైరెక్టర్ పై ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తూ ఎంత పని చేశావు డైరెక్టరూ చివరికి వీళ్లని చంపేసి సీరియల్ కి ఎండ్ కార్డ్ వేయాలనుకున్నావా? అని శాపనార్థాలు పెడుతున్నారు.
ఇది నిజంగా నిజమేనని చూపిస్తాడా? లేక ట్విస్ట్ ఇచ్చి సౌందర్య డ్రీమ్ గా కవర్ చేస్తాడా? అన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. అయితే ముగ్గురి ఫొటోలకు దండేసిన సీన్ చూసిన ప్రేక్షకులు మాత్రం డైరెక్టర్ పై విరుచుకుపడుతున్నారు. ఏం జరిగిందో తెలియాలంటే ఈ రోజు ఎపిసోడ్ చూడాల్సిందే.