English | Telugu
అను కోసం మాన్సీ చేస్తున్న కుట్ర ఏంటీ?
Updated : Mar 8, 2022
బుల్లితెర పై ప్రసారం అవుతున్న సీరియల్ `ప్రేమ ఎంత మధురం`. గత కొన్ని వారాలుగా అలరిస్తున్న ఈ సీనియల్ రోజుకో ములుపు తిరుగుతూ ఆకట్టుకుంటోంది. శ్రీరామ్ వెంకట్ నటించి ఈ సీరియల్ ని నిర్మించారు. వర్ష, విశ్వమోహన్, జయలలిత, జ్యోతిరెడ్డి, రామ్ జగన్, బెంగళూరు పద్మ కీలక పాత్రల్లో నటించారు. గత జన్మ ప్రతీకారం అనే థ్రిల్లింగ్ కాన్సెప్ట్ తో ఈ సీరియల్ ని రూపొందించారు. పెద్దమ్మ బస్తీ ని లోకల్ ఎమ్మెల్యే కబ్జా చేశాడని తెలిసి అతనికి బుద్ధిచెప్పడానికి రెడీ అవుతాడు ఆర్య వర్థన్ అయితే తిరిగి ఆ బస్తీలో వున్న సొంత ఇంటికే సుబ్బు తిరిగి రావాలని కండీషన్ పెడతాడు ఆర్య.. అందుకు సుబ్బు అంగీకరించడంతో ఆర్య రంగంలోకి దిగి లోకల్ ఎమ్మెల్యేకు బుద్ధి చెబుతాడు.
బస్తీలోకి తిరిగి అను ఫ్యామిలీని తీసుకొస్తాడు ఆర్య. అయితే బస్తీవాసులకు పట్టాలు అందజేసే కార్యక్రమాన్ని అను చేతుల మీదుగా జరిగిపిస్తాడు. అక్కడ తన తల్లి తండ్రులు చెప్పింది విన్న అను పరుగెత్తుకుంటూ వెళ్లి ఆర్యని హగ్ చేసుకుంటుంది. అయితే దీనికి ముందే ఆర్య వర్థన్ ఇంట్లో మాన్సీ ఆమె తల్లి కొత్త కుట్రకు తెరలేపుతారు. ఇంత కాలం కనిపించకుండా వున్న మాన్సి తల్లి రంగంలోకి దిగుతుంది. అనుని తల్లి కాకుండా చేయడం కోసం కుట్ర మొదుపెడుతుంది.
ఇంట్లో జరుగుతున్న గొడవలు సమసి పోవాలంటే ఏం చేయాలని సిద్ధాంతిని ఇంటికి పిలిపించి ఆర్య తల్లి అడుగుతుంది. అంతా పరిశీలించిన సిద్ధాంతి వారసుడు పుడితే సమస్యలన్నీ తొలగిపోతాయంటాడు. వెంటనే ఆర్య - అనులకు శోభనం జరిపించండని, ముహూర్తం కూడా పెడతాడు. ఇదంతా చాటుగా గమనించిన మాన్సీ విషయాన్ని తల్లికి చేరవేస్తుంది. తన కంటే ముందు నువ్వే వారసుడిని కనాలని, అదే సమయంలో అనుకు పిల్లలు పుట్టకుండా అడ్డంకులు సృష్టించాలంటుంది. దీంతో మాన్సి అను కోసం కుట్ర చేయడం మొదలుపెడుతుంది. ఆ తరువాత ఏం జరిగింది? అన్నది తెలియాలంటే ఈ రోజు ఎపిసోడ్ చూడాల్సిందే.