English | Telugu
బిగ్ బాస్ నాన్ స్టాప్ నుంచి నవ్వుతూ వెళ్లిపోయిన శ్రీ రాపాక
Updated : Mar 13, 2022
బిగ్ బాస్ నాన్ స్టాప్ రెండు వారాలు పూర్తి చేసుకుంది. మొత్తం 17 మంది కంటెస్టెంట్స్ తో ప్రారంభమైన ఈ షోలో రెండో ఎలిమినేషన్ పూర్తయింది. మొదటి వారం ముమైత్ ఖాన్ ఎలిమినేట్ కాగా.. ఈ వారం శ్రీ రాపాక ఎలిమినేట్ అయింది. అయితే శ్రీ రాపాక నవ్వుతూ హౌస్ నుంచి బయటకు రావడం విశేషం.
రెండో వారం ఎలిమినేషన్ కి ఏకంగా 11 మంది నామినేట్ అయ్యారు. ఎప్పటిలాగే ఆదివారం గ్రాండ్ ఎంట్రీ ఇచ్చిన నాగార్జున పలు టాస్క్ లు ఆడించి డేంజర్ జోన్ లో మిత్రా శర్మ, శ్రీరాపాక, నటరాజ్ మాస్టర్ ఉన్నట్లు తెలిపారు. ఆ తర్వాత ముగ్గురికి ఎగ్స్ టాస్క్ ఇచ్చి గేమ్ ఆడించగా ఆ టాస్క్ లో మిత్రా సేఫ్ అయింది. ఫైనల్ గా నటరాజ్ మాస్టర్, శ్రీరాపాక నామినేషన్ లో మిగిలి ఉండగా.. శ్రీరాపాక ఎలిమినేట్ అయింది.
శ్రీరాపాక ఎలిమినేట్ కానుందని ముందు నుంచే వార్తలొచ్చాయి. అనుకున్నట్లే ఆమెనే ఎలిమినేట్ అయింది. అయితే ఆమె అసలు ఏ మాత్రం బాధ పడకుండా నవ్వుతూ హౌస్ నుండి బయటకు వెళ్లడం ఆశ్చర్యపరిచింది.