English | Telugu
వేద - యష్‌లకు షాకిచ్చిన ఖుషీ.. ఏం జరిగింది?
Updated : Mar 9, 2022
బుల్లితెరపై ప్రసారం అవుతున్న సీరియల్ `ఎన్నెన్నో జన్మలబంధం`. గత కొన్ని వారాలుగా విజయవంతంగా ప్రదర్శింపబడుతూ మహిళా ప్రేక్షకుల్ని, పిల్లల్ని విశేషంగా ఆకట్టుకుంటోంది. ఓ పాప చుట్టూ తిరిగే కథగా ఈ సీరియల్ ని దర్శకుడు రూపొందిస్తున్నాడు. పిల్లలు పుట్టని ఓ డాక్టర్.. తల్లిదండ్రులు పట్టించుకోని ఓ పాప మధ్య ఏర్పడిన ప్రేమబంధం నేపథ్యంలో ఈ సీరియల్ ఆద్యంతం ఆసక్తికరంగా సాగుతోంది. యశోధర్, వేదలు పెళ్లి చేసుకున్నారన్న విషయం తెలిసి మాళవిక షాక్ అవుతుంది.
తనని నమ్మించి మోసం చేశావని వేదపై మాళవిక ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తుంది. ఈ క్రమంలో వేదపై చేయి చేసుకునే ప్రయత్నం చేస్తుంది. అయితే వేద ఆ ప్రయత్నాన్ని తిప్పికొట్టి మాళవికకు గట్టి షాకిస్తుంది. యశోధర్ నిజస్వరూపం తెలిశాకే ఖుషీని కాపాడుకోవాలని అతన్ని పెళ్లి చేసుకున్నానని మాళవికకు చెబుతుంది వేద. ఇక కోర్టులో ఖుషీని పిలిచి నువ్వు ఎవరి దగ్గర వుండాలనుకుంటున్నావని అడిగితే అమ్మ మాళవిక దగ్గరే వుంటానని చెబుతుంది. ఖుషీ నుంచి ఊహించని సమాధానం రావడంతో యశోధర్, వేద షాక్ కు గురవుతారు.
అభిమన్యు ఇక కేసు గెలిచామని అనందంతో పొంగిపోతాడు.. యష్ ని వేధించడం మొదలుపెడతాడు. ఆడదాన్ని అడ్డుపెట్టుకుని కూడా కేసు గెలవలేకపోయావని యశోధర్ ని అవహేళన చేస్తాడు. యష్ - వేదలకు ఏం జరిగిందో.. ఏం జరుగుతోందో అర్థం కాదు. ఖుషీ దూరమైపోయింది. ఇక మనం కలిసి వుంటడంలో అర్థం లేదని అక్కడే గొడవడతారు. ఇది చూసిన అభిమన్యు మరింతగా రెచ్చిపోతాడు. పిల్లలు కనలేని పనికిమాలింది నీకు పెళ్లామా? అని యష్ ని నిలదీస్తాడు. దీంతో యష్ ఆగ్రహం కట్టలు తెంచుకుంటుంది.. ఖుషీ ఎందుకలా మాట్లాడింది? .. అసలు ఏం జరిగింది? .. మాళవిక, అభిమన్యు .. ఖుషీని ఎలా మార్చారు? ..అది నిజమేనా? అన్నది తెలియాలంటే ఈ రోజు ఎపిసోడ్ చూడాల్సిందే.