English | Telugu
అరియానా నడుముకు నాగ్ మార్కులు.. చైతూ కౌంటర్!
Updated : Mar 7, 2022
బిగ్‌బాస్ నాన్ స్టాప్ షో ఓటీటీలో హల్ చల్ చేస్తోంది. గత నెల 26న మొదలైన ఓటీటీ షో 24 గంటల నాన్ స్టాప్ ఎంటర్‌టైన్మెంట్ అనే కాన్సెస్ట్ తో డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో స్ట్రీమింగ్ అవుతోంది. ఎప్పటి లాగే బిగ్‌బాస్ సీజన్ లో సండే ఫండే చేసేందుకు కింగ్ నాగార్జున షోలోకి ఎంట్రీ ఇవ్వడం తెలిసిందే. బిగ్‌బాస్ నాన్ స్టాప్ లోనూ సండే రోజున హౌస్ లో సందడి చేస్తున్నారు నాగార్జున. ఫస్ట్ ఎలిమినేషన్ టైమ్ రావడంతో షోలోకి వచ్చేశారు. అనుకున్నట్టుగానే ముమైత్ ఖాన్ ఎలిమినేట్ అయిపోయింది. అయితే ముమైత్ కాకుండా సరయు ఎలిమినేట్ అవుతుందేమోనని తను ఏడ్చేసింది.
ఇదిలా వుంటే నాగ్ వారియర్స్ . ఛాలెంజర్స్ మధ్య డ్యాన్స్ ఛాలెంజ్ పెట్టారు. ఈ రెండు టీమ్ ల నుంచి ఒక్కో కంటెస్టెంట్ ను సెలెక్ట్ చేసుకుని డ్యాన్స్ చేయాల్సి ఉంటుంది. అలా యాంకర్ శివ - తేజస్వి, అరియానా - ఆర్జే చైతూ - అఖిల్ - బిందు మాధవి, అషు రెడ్డి - స్రవంతి జోడీగా ఏర్పడి డ్యాన్స్ చేశారు. అయితే ఈ నాలుగు జోడీల్లో ఆర్జే చైతూ - అరియానాల డ్యాన్స్ హాట్ టాపిక్ గా మారింది. ఆర్జే చైతు - అరియానా డాన్స్ కి నాగార్జున మార్కులేసాడు. అయితే దీనికి చైతూ కౌంటర్ వేయడం ఆకట్టుకుంది.
అరియానాకు తొమ్మిది మార్కులు ఇచ్చారు. అర్జే చైతూకి ఎనిమిది మార్కులే పడ్డాయి. దీంతో ఆర్జే చైతూ కౌంటరేశాడు. మీరు మార్కులు ఇచ్చింది అరియానా డ్యాన్స్ కా? నడుముకా ? సర్ అని అడిగేశాడు. కరెక్ట్ గా చెప్పావ్ .. అరియానా నడుముకే అన్నట్టుగా నాగ్ సెటైర్ వేశాడు. తేజస్వితో డ్యాన్స్ చేసేందుకు యాంకర్ శివ తెగ కష్టపడ్డాడు. తేజస్వీ మాస్ స్టెప్పులతో దుమ్ములేపేసింది. అయితే యాంకర్ శివ చేసిన ధైర్యానికి నాగ్ 9 మార్కులు వేశారు. తేజస్వికి కూడా తొమ్మిది మార్కులు పడ్డాయి. దీంతో వారియర్ టీం ఛాలెంజర్స్ పై గెలిచింది.