English | Telugu
ఇది ఉమెన్స్ డే కాదు.. ఫూల్స్ డే!
Updated : Mar 8, 2022
మహిళా దినోత్సవం సందర్భంగా ఈరోజు మహిళలకు పెద్ద ఎత్తున శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. సామాన్యుల నుంచి సెలబ్రిటీల వరకు సోషల్ మీడియా వేదికగా మహిళలను ప్రశంసిస్తూ, శుభాకాంక్షలు తెలుపుతూ పోస్ట్ లు పెడుతున్నారు. కానీ యాంకర్ అనసూయ మాత్రం 'ఇది ఉమెన్స్ డే కాదు.. ఫూల్స్ డే' అంటూ సంచలన ట్వీట్ చేసింది.
సోషల్ మీడియాలో అనసూయపై పెద్ద ఎత్తున ట్రోల్స్ వస్తుంటాయి. వాటికి ఆమె అంతే ధీటుగా సమాధానం చెప్తుంటుంది. ఉమెన్స్ డే సందర్భంగా ట్రోలర్స్ ని ఎద్దేవా చేస్తూ అనసూయ ఓ ట్వీట్ చేసింది. "సడెన్ గా ట్రోలర్స్, మీమర్స్ ఓ 24 గంటల పాటు మహిళలకు గౌరవం ఇస్తారు. దీనికి మహిళలు దూరంగా ఉండండి. హ్యాపీ ఫూల్స్ డే" అంటూ అనసూయ చేసిన ట్వీట్ వైరల్ గా మారింది.
అనసూయ ట్వీట్ ని కొందరు సమర్దిస్తుంటే, మరికొందరు మాత్రం తప్పుబడుతున్నారు. కేవలం ఒక్కరోజు సోషల్ మీడియాలో మహిళల గురించి గొప్పగా మాట్లాడి, మరుసటి రోజు నుంచి మహిళలపై కామెంట్స్ చేసే వాళ్ళు ఉన్నారు అంటూ కొందరు అనసూయకి సపోర్ట్ గా మాట్లాడుతుతున్నారు. అయితే మరికొందరు మాత్రం అనసూయని తప్పుబడుతున్నారు. మదర్ థెరీసా, మేరి కోమ్, కల్పనా చావ్లా వంటి వారిపై ఎవరూ ట్రోల్స్ చేయరని, యాంకర్ సుమని కూడా ఎవరూ ట్రోల్ చేయట్లేదని.. మీ తీరే మీపై ట్రోల్స్ కి కారణమని కొందరు నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.