English | Telugu
సరయుపై దాడి చేసిన వర్మ హీరోయిన్
Updated : Mar 11, 2022
బిగ్‌బాస్ నాన్ స్టాప్ ఓటీటీ షో ఇటీవల మొదలైన విషయం తెలిసిందే. డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో స్ట్రీమింగ్ అవుతున్న ఈ రియాలిటీ షో.. బిగ్‌బాస్ టెలివిజన్ షోని మించి పరాకాష్టకు చేరినట్టుగా కనిపిస్తోంది. టెలివిజన్ ఎపిసోడ్ కి మించి కంటెస్టెంట్ లు విచ్చలవిడిగా ప్రవర్తిస్తుండటం విమర్శలకు తావిస్తోంది. కులాల రచ్చ.. ఒకరిని ఒకరు కొట్టుకోవడం.. చెప్పడానికి వీలు కాని భాషలో తిట్టుకోవడం వంటివి చేస్తూ రచ్చ రచ్చ చేస్తున్నారు. తాజాగా బిగ్‌బాస్ నాన్ స్టాప్ షో కెప్టెన్సీ కంటెండర్ టాస్క్ తో రసవత్తరంగా మారింది.
అటు వారియర్స్ , ఇటు ఛాలెంజర్స్ తగ్గేదిలే అన్నటుగా ఆడుతున్నారు. గాయాలవుతున్నా పట్టించుకోకుండా వీర విహారం చేస్తున్నారు. కెప్టెన్సీ కంటెండర్ టాస్క్ మొదటి లెవెల్ లో వారియర్స్ స్మగ్లర్లుగా, ఛాలెంజర్స్ పోలీసుల్లా మారగా రెండో లెవెల్ లో వారి పాత్రలు తారుమారయ్యాయి. దీంతో వారియర్స్ కు చుక్కలు చూపించారు ఛాలెంజర్స్. ఈ సారి ఎలాగైనా గేమ్ గెలవాలని అందుకు బలంగా పోటీలోకి దిగిన వీరు మాస్టర్ ప్లాన్ వేసుకున్నట్టుగా తెలుస్తోంది.
ఇదే గేమ్ లో రసవత్తర పరిణామం చోటు చేసుకుంది. ఇదే గేమ్ లో ముందు గాయాలపాలైన శ్రీరాపాక తన ప్రతీకారాన్ని తీర్చుకుంది. తనని ఎవరైతే గాయపరిచారో మళ్లీ వాళ్లనే గాయపరిచి షాకిచ్చింది. శ్రీ రాపాక తనని గాయపరిచిన సరయుని తాజాగా గాయపరిచి తన పంతం నెగ్గించుకుంది. దీంతో షాక్ కు గురైన అఖిల్ వెంటనే శ్రీ రాపాకపై సీరియస్ అయ్యాడు. ఏం చేస్తున్నావో నీకు తెలుస్తోందా? అంటూ ఫైర్ అయ్యాడు. ఇక స్విమ్మింగ్ పూల్ లో దూకేసిన స్రవంతి ... సరయుపై సీరియస్ కావడం కొసమెరుపు.