English | Telugu

'నో కామెంట్' అంటూనే ఆర్జీవీపై యాంకర్ శ్యామల కామెంట్స్

'బడవ రాస్కెల్' మూవీ ఈవెంట్ లో యాంకర్ శ్యామల గురించి డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. మీరు చాలా అందంగా ఉన్నారని, ఈ అందం ఇంతకాలం నా కళ్ళ నుంచి ఎలా తప్పించుకుంది అంటూ శ్యామలని ఆర్జీవీ ప్రశంసించారు. అయితే తాజాగా శ్యామల కూడా ఆర్జీవీ గురించి ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసింది.

తాజాగా శ్యామల ఇన్ స్టాగ్రామ్ లో అభిమానులతో చర్చించింది. ఈ సందర్భంగా ఆమెకు ఆర్జీవీకి సంబంధించిన ప్రశ్నలు ఎదురయ్యాయి. 'ఆర్జీవీ గురించి చెప్పండి' అని ఓ నెటిజన్ అడగగా.. 'నో కామెంట్' అంటూనే ఆసక్తికర కామెంట్స్ చేసింది శ్యామల. 'ఆయన గ్రేట్ డైరెక్టర్. ఆయన మొదట్లో చేసిన సినిమాలకు పెద్ద అభిమానిని' అని శ్యామల చెప్పింది. అంటే ఆర్జీవీ ఇప్పుడు మంచి సినిమాలు తీయట్లేదని, ఆయన ఇప్పుడు తీసే సినిమాలకు ఫ్యాన్ కాదని ఇన్ డైరెక్ట్ గా చెబుతున్నారా అంటూ నెటిజన్లు సరదాగా కామెంట్స్ చేస్తున్నారు.

మరొక నెటిజన్ 'ఆర్జీవీ చెప్పినట్లు మీరు నిజంగా ఏంజెల్ మేడం. అన్నం తింటున్నారా లేక అందం తింటున్నారా' అని అడగగా.. 'అన్నమే తింటున్నాను' అంటూ సరదాగా సమాధానం ఇచ్చింది శ్యామల. అలాగే తన ఫేవరెట్ హీరో మహేష్ బాబు, ఫేవరెట్ హీరోయిన్ అనుష్క శెట్టి అని తెలిపింది. 'ప్రభాస్ or పవన్ కళ్యాణ్' అని ఒక నెటిజన్ అడగగా.. ప్రస్తుతం 'రాధేశ్యామ్' కోసం ఎదురుచూస్తున్నాను అంటూ పరోక్షంగా ప్రభాస్ పేరు చెప్పింది శ్యామల.

Podharillu:పొదరిల్లు సీరియల్ లో సూపర్ ట్విస్ట్.. మహాలక్ష్మికి పెళ్ళి ఫిక్స్!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పోదరిల్లు'(Podharillu). ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -02 లో.....మహాలక్ష్మి ప్రాజెక్ట్ డిజైన్ రెడీ చేసి హాల్లోకి వస్తుంది. వాళ్ళ నాన్న ప్రతాప్ ఇంకా అన్నయ్య మహాలక్ష్మికి డెస్టినేషన్ వెడ్డింగ్ ప్లాన్ చేస్తారు. ఒకసారి చూడు మహా అని వాళ్ళ అన్నయ్య అంటాడు. నాకేం ఇప్పుడు పెళ్లి వద్దు అవసరం అయితే వదిన నువ్వు మళ్ళీ పెళ్లి చేసుకోండి అని మహా అంటుంది. ఇప్పుడు డిజైన్స్ చూపించడానికి వెళ్తున్నానని తెలిస్తే డాడీ వద్దని అంటాడనుకొని డాడీ కాలేజీలో సర్టిఫికెట్ ఉన్నాయి తెచ్చుకుంటానని చెప్తుంది.