English | Telugu

నిధి కోసం వేద‌ని ఏడిపిస్తున్న య‌ష్‌

బుల్లితెర‌పై ప్ర‌సారం అవుతున్న సీరియ‌ల్ `ఎన్నెన్నో జ‌న్మ‌ల బంధం`. హిందీ సీరియ‌ల్ ఆధారంగా ఈ సీరియ‌ల్ ని రీమేక్ చేశారు. నిరంజ‌న్‌, డెబ్జాని మోడ‌క్‌, మిన్ను నైనిక కీల‌క పాత్ర‌ల్లో న‌టించారు. బెంగ‌ళూరు ప‌ద్మ‌, అనంద్‌, జీడిగుంట శ్రీ‌ధ‌ర్‌, ప్ర‌ణ‌య్ హ‌నుమండ్ల‌, మీనాక్షి త‌దిత‌రులు ఇత‌ర పాత్ర‌ల్లో న‌టించారు. పిల్ల‌లే పుట్ట‌న ఓ యువ‌తి.. త‌ల్లి ఆద‌ర‌ణ లేని ఓ పాప మ‌ధ్య పెన‌వేసుకున్న అనుబంధం విధి ఆడిన వింతాట‌లో ఇద్ద‌రిని త‌ల్లీకూతుళ్ల‌ని చేసింది. అనే క‌థాంశంతో ఈ సీరియ‌ల్ ని రూపొందించారు. గ‌త కొన్ని వారాలుగా మ‌హిళా ప్రేక్ష‌కుల్ని ఆక‌ట్టుకుంటూ మంచి రేటింగ్ తో `స్టార్ మా`లో కొన‌సాగుతోంది...

రాకింగ్ రాకేష్‌.. జోర్దార్ సుజాత.. ఏం జ‌రుగుతోంది?

జ‌బ‌ర్ద‌స్త్ కామెడీ షో ప్రేమ జంట‌ల‌కు కేరాఫ్ అడ్ర‌స్ గా మారుతోంది. ఇప్ప‌టికే ఈ షో ద్వారా సుడిగాలి సుధీర్ - ర‌ష్మీ గౌత‌మ్ క్రేజీ జోడీగా పాపుల‌ర్ అయ్యారు. ఎంతో మంది ఫ్యాన్స్ ని సొంతం చేసుకున్నారు. ఈ స్టేజ్ పై సుడిగాలి సుధీర్ - ర‌ష్మీల మ‌ధ్య స్కిట్ అంటే అది నెట్టింట ఓ రేంజ్ లో పేలుతూ వ‌స్తోంది. తాజాగా ఈ షో లో మ‌రో జంట వార్త‌ల్లో నిల‌వ‌డం మొద‌లైంది. అదే జోర్దార్ సుజాత - రాకింగ్ రాకేష్‌. ఈ మ‌ధ్యే వీరిద్ద‌రు క‌లిసి స్కిట్ లు చేయ‌డం మొద‌లు పెట్టారు. కామెడీ స్టార్స్ నుంచి బ‌య‌టికి వ‌చ్చేసిన సుజాత ఫైన‌ల్ గా రాకింగ్ రాకేష్ తో క‌లిసి స్కిట్ లు చేస్తోంది....

బిగ్ బాస్ 6 కంటెస్టెంట్స్ ఫైన‌ల్ లిస్ట్ లోడింగ్‌

బిగ్ బాస్ నాన్ స్టాప్ గ్రాండ్ ఫినాలేకి రెడీ అవుతోంది. త్వ‌ర‌లోనే టాప్ 5 ఫైన‌ల్ కాబోతోంది. అంతే కాకుండా మ‌రో మూడు వారాల్లో ఓటీటీ సీజ‌న్ కి ఎండ్ కార్డ్ ప‌డ‌బోతోంది. ప్ర‌స్తుతం హౌస్ లో వున్న 9 మంది కంటెస్టెంట్ ల‌లో బిందు మావి టైటిల్ రేస్ లో దూసుకుపోతోంది. అఖిల్ సీజ‌న్ 4 లో ర‌న్న‌ర్ గా మిగిలిన‌ట్టే ఈ ఓటీటీ వెర్ష‌న్ లోనూ వెన‌క‌బ‌డే వున్నాడు. ఈ సారి కూడా త‌ను విజేత కాలేడ‌న్న‌ది తేలిపోయింది. ఇదిలా వుంటే బిగ్ బాస్ నాన్ స్టాప్ విన్న‌ర్ ని ప్ర‌క‌టించ‌కుండానే సీజ‌న్ 6 కి స‌న్నాహాలు జ‌రుగుతున్నాయి. ఇటీవ‌లే కంటెస్టెంట్ ల వేట కూడా మొద‌లైన‌ట్టుగా చెబుతున్నారు...