English | Telugu

'మహానటి'గా వంటలక్క.. నెటిజన్ల మీమ్స్!

దర్శకుడు నాగ్ అశ్విన్ రూపొందించిన 'మహానటి' సినిమాలో కీర్తి సురేష్ ప్రధాన పాత్ర పోషించిన సంగతి తెలిసిందే. ఈ సినిమాలో 'ఒక కంటితో కన్నీళ్లు' సీన్ అందరికీ గుర్తు ఉండే ఉంటుంది. గ్లిజరిన్ వాడకుండా ఎడమ కంటి నుండి షాట్ టైమ్ కి రెండు కన్నీళ్ల బొట్లు రావాలి. ఆ సీన్ లో సావిత్రి నటన చూసిన డైరెక్ట‌ర్ కేవీ రెడ్డి మైమరిచిపోతారు. అయితే ఇప్పుడు ఇదే మాదిరిగా ఒక కంటిలో నుండి కన్నీళ్లు రప్పించి బుల్లితెర ప్రేక్షకులను మెస్మరైజ్ చేసింది వంటలక్క.

'కార్తీక దీపం' సీరియల్ లో వంటలక్కకి ఎంతమంది ఫ్యాన్స్ ఉన్నారో తెలిసిందే. సీన్ పండాలంటే వంటలక్క ఉండాల్సిందేనని అంటారు అభిమానులు. తన కనురెప్పలతో బెదిరించడమే కాకుండా.. హావభావాలతో ప్రేక్షకుల కళ్లనిండా నీళ్లు తెప్పించేస్తుంది వంటలక్క. గత వారం రోజులుగా ఈ సీరియల్ చాలా ఎమోషనల్ గా సాగుతుంది. వంటలక్క చనిపోతుందనే విషయం సీరియల్ లో హాట్ టాపిక్ గా మారింది. వంటలక్క తన గతాన్ని, భవిష్యత్తుని తలచుకుంటూ బాధపడుతున్న సమయంలో డాక్టర్ బాబు ధైర్యం చెబుతాడు. అతడి మాటలకు ఓ నవ్వు నవ్వి దీనంగా చూస్తూ అందరినీ ఏడిపించేసింది.

ఆ సందర్భంలో ఓ కాంతిలో విషాదం, మరో కాంతిలో కన్నీరు అన్నట్లుగా ఎడమ కంటి నుండి కన్నీళ్లను విడిచి 'మహానటి' సావిత్రి నటనను గుర్తుచేసిందని అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు. ఈ సీన్ లో వంటలక్క ఎక్స్‌ప్రెష‌న్స్‌ను క్యాప్చర్ చేసి వాటిపై మీమ్స్ క్రియేట్ చేస్తున్నారు. ఈ మీమ్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

Karthika Deepam2: వైరాతో జ్యోత్స్న డీలింగ్.. కార్తీక్ కి డౌట్!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం 2'(Karthika Deepam2).ఈ సీరియల్ గురువారం నాటి ఎపిసోడ్ -544 లో.....శౌర్యకి దీప భోజనం తినిపిస్తుంది. అది చూసి కొడుకు కోడలితో చెల్లి మాట్లాడుతలేనట్లు ఉందని అనసూయ అంటుంది. వాళ్లే దాక్కొని తిరుగుతున్నారని కాంచన అంటుంది. శౌర్య వెంట భోజనం తినమని దీప పరుగెడుతుంది. శౌర్య అలా అమ్మని పరిగెత్తించవచ్చా.. ఇప్పుడు అమ్మ కడుపులో బేబీ ఉంది కదా తనకి ఆయాసం వస్తుంది ఇకనుండి నువ్వే భోజనం చెయ్యాలని కాంచన అనగానే.. నువ్వు మంచి నానమ్మవి కాదు నిన్ను తాతయ్య దగ్గరికి పంపించాలి.. మా అమ్మ నాకు తినిపించకుండా చేస్తున్నావని శౌర్య అంటుంది.

Illu illalu pillalu: ఇంగ్లీష్ టీచర్ గా శ్రీవల్లి.. ప్రేమ, నర్మద ప్లాన్ సూపర్!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'ఇల్లు ఇల్లాలు పిల్లలు'(Illu illalu pillalu ). ఈ సీరియల్ గురువారం నాటి ఎపిసోడ్ -345 లో... భాగ్యం, ఆనందరావు ఇద్దరు రామరాజు ఇంటికి శ్రీవల్లి డూప్లికేట్ సర్టిఫికేట్లు తీసుకొని వస్తారు. అవి ప్రేమ చూసి డూప్లికేట్ సర్టిఫికేట్లు అని చెప్పదు. ఇంకేంటి మావయ్య మీరు మీకు తెలిసిన కాలేజీ ప్రిన్సిపల్ కి ఫోన్ చెయ్యండి.. అక్క  ఇంగ్లీష్ టీచర్ గా జాయిన్ చెయ్యండి అని ప్రేమ అంటుంది. రామరాజు ఫోన్ చేస్తుంటే కావాలనే శ్రీవల్లి తుమ్ముతుంది. ఇప్పుడే వద్దు మావయ్య అంటుంది. అయినా రామరాజు వినకుండా ఫోన్ చేసి ప్రిన్సిపల్ తో మాట్లాడతాడు.