English | Telugu

పొట్టి నిక్క‌రుతో శ్రీ‌ముఖి డాన్స్ షో.. వైర‌ల్ అయిన వీడియో!

టీవీ రంగంలో ఎంతమంది గ్లామరస్ యాంకర్లు ఉన్నప్పటికీ శ్రీముఖి మాత్రం తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకుంది. ఎలాంటి షో చేసినా తన యాంకరింగ్ తో ఆకట్టుకుంటోంది. నటిగా కెరీర్ మొదలుపెట్టిన ఆమె మెల్లగా బుల్లితెరపై ఎంట్రీ ఇచ్చింది. 'పటాస్' షోతో అమ్మడు క్రేజ్ అమాంతం పెరిగిపోయింది. యాంకర్ గానే కాకుండా తన గ్లామర్ షోతో ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకుంది.

ఎప్పటికప్పుడు సరికొత్త ఫోటో షూట్ లలో పాల్గొంటూ వాటిని సోషల్ మీడియాలో షేర్ చేస్తూ ఫాలోవర్స్ ను పెంచుకుంటోంది. ఇక రీసెంట్ గా శ్రీముఖి గ్లామరస్ సెక్సీ డాన్స్ స్టెప్పులతో నెటిజన్లను ఆకట్టుకుంది. ర్యాప్ సింగర్ రోల్ రైడా పాడిన 'చిన్నా' అనే పాట ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోన్న సంగతి తెలిసిందే. ఈ పాటకు కీర్త‌నా సునీల్‌తో క‌లిసి శ్రీముఖి డాన్స్ చేసింది. ఇన్స్టాగ్రామ్ లో షేర్ చేసిన ఈ వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది.

ఇందులో శ్రీముఖి చిన్న నిక్కర్ వేసుకొని డాన్స్ చేయడంతో నెటిజన్లు ఈ వీడియోను తెగ షేర్ చేస్తున్నారు. ఈ మధ్యనే శ్రీముఖి తన యూట్యూబ్ ఛానెల్ ను కూడా మొదలుపెట్టి దాని రీచ్ పెంచే పనిలో పడింది. లాక్ డౌన్ సమయంలో అవినాష్ తో కలిసి కొన్ని కామెడీ ఎపిసోడ్స్ కూడా చేసింది. అతడు బిగ్ బాస్ కు వెళ్లే సమయంలో శ్రీముఖి ఆర్థికంగా సహాయం కూడా చేసింది. ఫ్యూచర్ లో తన యూట్యూబ్ ఛానెల్ కంటెంట్ పై ఎక్కువగా ఫోకస్ చేయాలని ప్లాన్ చేసుకుంటోంది.

Podarillu : భూషణ్ మాటలు విని మహాని కొట్టిన ప్రతాప్.. తను ఏం చేయనుంది!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పోదరిల్లు'(Podarillu).ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -20 లో.....మీరు ఎవరికీ చెప్పకుండా పారిపోండి అని మహాకి చక్రి సలహా ఇస్తాడు. ఏం మాట్లాడుతున్నావ్ వాడికోసం మా నాన్న పరువు తియ్యాలా అని చక్రిపై మహా కోప్పడుతుంది. మహా తన గదిలోకి వెళ్లి.. మా నాన్న నన్ను చాలా బాగా చూసుకున్నాడు. అలాంటిది తనని మోసం చెయ్యలేనని మహా అనుకుంటుంది. అప్పుడే మహాకి భూషణ్ ఫోన్ చేస్తాడు. చిరాకుగా ఫోన్ పక్కన పెడుతుంది మహా. మళ్ళీ మళ్ళీ భూషణ్ ఫోన్ చేస్తుంటే ఫోన్ కట్ చేస్తుంది. ఏంటి నా ఫోన్ కట్ చేస్తుందా అని హారికకి ఫోన్ చేస్తాడు భూషణ్.