English | Telugu

'జబర్దస్త్'.. ఇంద్రజ అవుట్, రోజా ఈజ్ బ్యాక్‌!

'జబర్దస్త్' షోలో జడ్జి రోజా కీలకపాత్ర పోషిస్తుంటారు. తనదైన పంచ్ లు, కౌంటర్ లతో కమెడియన్స్ ను టీజ్ చేస్తూ షోని రక్తి కట్టిస్తుంటారు. గత కొంతకాలంగా ఆమె అనారోగ్య కారణాలతో 'జబర్దస్త్' షోకి దూరమైన సంగతి తెలిసిందే. ఆమె ప్లేస్ ను భర్తీ చేయడానికి ఒకప్పటి హీరోయిన్ ఇంద్రజను తీసుకొచ్చారు. తన అందం, అభినయంతో 'ఎక్స్ట్రా జబర్దస్త్' షోలో ఎంట్రీ ఇచ్చిన ఇంద్రజ తక్కువ సమయంలోనే తన పంచ్ లతో అందరినీ ఆక‌ట్టుకున్నారు.

దీంతో రోజా లేని లోటుని భ‌ర్తీ చేసింద‌నే పేరు తెచ్చుకున్నారు. స్కిట్ లలో ఇన్వాల్వ్ అవుతూ.. కంటెస్టెంట్స్ కు బూస్టింగ్ ఇస్తూ పూర్తి స్థాయిలో వినోదాన్ని పంచారు ఇంద్రజ. అంతేకాదు.. హీరోయిన్ గా రాని గుర్తింపు 'జబర్దస్త్' షో సంపాదించుకోగలిగారు. కొన్ని ఎపిసోడ్లే చేసినప్పటికీ..ఆమెకి ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా పెరిగిపోయింది. దీంతో ఇంద్రజ ఇక షోలో ఫుల్ టైమ్ జడ్జిగా కంటిన్యూ అవుతుందని అందరూ అనుకున్నారు.

అయితే ఇప్పుడు ఆ ఊహాగానాలకు ఫుల్ స్టాప్ పెట్టింది 'జబర్దస్త్' టీమ్. అనారోగ్యం నుండి తిరిగి కోలుకున్న రోజాను తిరిగి షోలోకి తీసుకొచ్చారు. మే 27న ప్రసారం కానున్న ఈ ఎపిసోడ్ కి సంబంధించిన ప్రోమోను విడుదల చేశారు. ఇందులో మ‌రో జ‌డ్జి మ‌నోతో క‌లిసి రోజా రెట్టింపు ఉత్సాహంతో కనిపించారు. రీఎంట్రీ ఇచ్చి తనదైన పంచ్ లతో అలరించారు. ఎప్పటిలానే టీమ్ లీడర్స్ రాసుకున్న పంచ్ లను ముందే చెప్పేస్తూ చురుకైన‌ జడ్జి అనిపించుకున్నారు రోజా.

Illu illalu pillalu : అమూల్య ఎంగేజ్ మెంట్ కు ఏర్పాట్లు.. శ్రీవల్లి ప్లాన్ ఏంటి!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ ఇల్లు ఇల్లాలు పిల్లలు(Illu illalu pillalu). ఈ సీరియల్ గురువారం నాటి ఎపిసోడ్-369 లో.. ప్రేమ అందంగా నగలతో రెడీ అవుతుంది. ఆ నగలు చూసి ధీరజ్ కోప్పడతాడు. ఆ నగల్ని చూస్తుంటే నాకు కంపరంగా ఉంది తీసెయ్ అని ధీరజ్ అనగానే.. మా అమ్మ ఈ నగల్ని ప్రేమతో ఇచ్చిందని ప్రేమ అంటుంది. మా నాన్న అవమానపడటానికి కారణం ఈ నగలే.. ఇవి నీ ఒంటి మీద కనపడటానికి వీల్లేదు తీసెయ్.. అని ధీరజ్ అనగానే ప్రేమ ఎమోషనల్ అవుతూ తీసేస్తుంది. మరోవైపు శ్రీవల్లి రెడీ అవ్వకుండా డల్ గా కూర్చుంటుంది. అప్పుడే ఆమె దగ్గరికి చందు వస్తాడు.

Brahmamudi : కావ్య దగ్గరికి వెళ్ళిన రాజ్.. పాప పుట్టిందిగా!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -929 లో.....కళ్యాణ్ కి రాజ్ ఫోన్ చేసి స్టేషన్ నుండి తప్పించుకోవడానికి ఒక ప్లాన్ చెప్తాడు. దాంతో కళ్యాణ్ తన ఫ్రెండ్ కి ఫోన్ చేసి స్టేషన్ కి వెళ్లి కానిస్టేబుల్ కి లంచ్ బాక్స్ ఇచ్చేసి రమ్మని చెప్తాడు. దాంతో కళ్యాణ్ ఫ్రెండ్ స్టేషన్ కి వెళ్లి లంచ్ బాక్స్ ఇస్తాడు. ఆ తర్వాత కళ్యాణ్ స్టేషన్ కి ఫోన్ చేసి.. మీ స్టేషన్ లో బాంబ్ పెట్టారు.. ఇందాక బాక్స్ తెచ్చారు కదా అందులో ఉందనగానే ఇన్‌స్పెక్టర్ తో పాటు అందరు బయటకు వెళ్తారు. అప్పుడే కళ్యాణ్ వచ్చి రాజ్ ని బైక్ పై తీసుకొని వెళ్తాడు.