English | Telugu

స్కిన్ షోతో షాకిస్తోన్న‌ 'జబర్దస్త్' వర్ష!

'జబర్దస్త్' షోతో పాపులర్ అయిన వారిలో వర్ష కూడా ఒకరు. నటి కావాలనే ఉద్దేశంతో ఇండస్ట్రీకి వచ్చిన ఆమె ముందుగా సీరియల్స్ లో అవకాశాలు దక్కించుకుంది. ఆ తరువాత 'జబర్దస్త్' షోలో టాప్ కమెడియన్ హైపర్ ఆది స్కిట్ లలో కనిపించి అందరినీ మెప్పించింది. చాలా తక్కువ సమయంలో మంచి గుర్తింపు తెచ్చుకుంది. కమెడియన్ ఇమ్మాన్యుయేల్ తో ఆమె చేసే రచ్చ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇద్దరి మధ్య లవ్ ట్రాక్ లు పెడుతూ హైలైట్ చేస్తుంటారు ప్రోగ్రామ్ నిర్వాహకులు.

ప్రస్తుతం 'జబర్దస్త్' షోతో పాటు 'శ్రీదేవి డ్రామా కంపెనీ' అనే షోతో బిజీగా గడుపుతోంది వర్ష. ఈ బ్యూటీ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటుంది. తరచూ తనకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు షేర్ చేస్తూ ఫాలోవర్ల సంఖ్య పెంచుకుంటోంది. గతంలో తెలుగమ్మాయిలు గ్లామర్ షో చేయడానికి పెద్దగా ఆసక్తి చూపేవారు కాదు. కానీ ఇప్పుడు ఇండస్ట్రీలో అవకాశాల కోసం హీరోయిన్లతో పోటీగా స్కిన్ షో చేస్తున్నారు.

ఇప్పుడు ఆ లిస్ట్ లో వర్ష కూడా చేరిపోయింది. తాజాగా ఈమె షేర్ చేసిన ఫోటోలు చూసిన నెటిజన్లు షాక్ అవుతున్నారు. స్కిన్ కలర్ టాప్ వేసుకొని ఒంటిపై బట్టలు లేనట్లుగా ఫోటోలకు ఫోజులిచ్చింది. తన హాట్ లుక్స్ తో నెటిజన్లను ఆకట్టుకోవాలని చూసింది. ఈ ఫోటోలు చూసిన కొందరు ఆమె గ్లామర్ షోపై పాజిటివ్ కామెంట్స్ చేస్తుంటే మరికొందరు మాత్రం.. 'అమ్మా నాన్న వేసుకోవడానికి బట్టలు ఇవ్వలేదా..?' అంటూ విమర్శిస్తున్నారు. అతి తక్కువ సమయంలోనే ఈ ఫోటోలు తెగ వైరల్ అవుతున్నాయి.

Jayam serial : బాక్సింగ్ పోటీలో మిస్సెస్ గంగ రుద్ర ప్రతాప్.. పారు ఏం చేయనుంది!

జీ తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్ 'జయం'(Jayam). ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ -160 లో..... గంగని ఎలాగైనా అకాడమీ సెలక్షన్ కి వెళ్లకుండా ఆపాలని ఇషిక, వీరు ట్రై చేస్తారు కానీ గంగ, రుద్ర ఇద్దరు కలిసి ఇంట్లో అన్ని పనులు పూర్తి చేసి అకాడమీకి వెళ్తారు. రుద్ర అకాడమీ బయటే ఉంటాడు. నాకు సంబంధించిన కేసు ఇంకా పెండింగ్ లో ఉంది అలా ఉండగా.. నేను లోపలకు రాకూడదని రుద్ర బయటే ఉండి గంగకి అంతా వివరిస్తాడు. నేను నీ పేరు మైక్ లో రావడం వినాలని రుద్ర అంటాడు. గంగ లోపలకు వెళ్తుంది. అక్కడ పారు ఇంకా తన ఫ్రెండ్స్ కలిసి గంగని చులకనగా మాట్లాడుతారు.

Brahmamudi : రుద్రాణిని రెడ్ హ్యాండెడ్ గా పట్టించిన కనకం!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ -922 లో.. ఒకతను వచ్చి రుద్రాణికి మళ్ళీ పసరు మందు ఇస్తాడు. ఆ పసరు మందు పని చేస్తుందా లేదా అని రుద్రాణి అతన్ని అడుగుతుంది. పని చేస్తుందని అతను చెప్తాడు. దాంతో రుద్రాణి పసరు మందు తీసుకొని లోపలికి వెళ్తుంటే అప్పుడే కనకం ఎదురుపడుతుంది. కనకాన్ని చూసి రుద్రాణి టెన్షన్ పడుతుంది. చేతిలో అదేంటీ అని కనకం అనగానే ఇదా.... నాకే పసరు మందు అజీర్తికి వాడమని చెప్పారని చెప్పి రుద్రాణి వెళ్ళిపోతుంది. అలా అయితే ఇంత రాత్రివేళ తీసుకొని వెళ్తుంది ఏంటని కనకంకి డౌట్ వస్తుంది.