మారని నటరాజ్ మాస్టర్.. రవి దగ్గర కూడా అదే తీరు!
బిగ్ బాస్ తెలుగు ఓటీటీ ఎండింగ్ స్టేజ్ కి వచ్చేసింది. టైటిల్ ను గెలిచేందుకు హౌస్మేట్స్ గట్టి పోటీ పడుతున్నారు. ఇక గత వారం హౌస్మేట్స్ అంతా నామినేషన్స్ లో వున్నారు. బిందు మాధవి, అఖిల్, బాబా భాస్కర్, నటరాజ్ మాస్టర్, అరియానా, మిత్ర, అనిల్, యాంకర్ శివ నామినేషన్స్ లో వున్నారు. అయితే వీళ్లలో నటరాజ్ మాస్టర్ ఎలిమినేట్ అయ్యాడు. తక్కువ ఓట్ల కారణంగా తను హౌస్ నుంచి ఎలిమినేట్ కావాల్సి వచ్చింది.