English | Telugu
ఇంకెప్పుడు మళ్లీ మనం ఫ్రీ అవుతాం?.. బికినీ ఫొటోతో బిగ్ బాస్ బ్యూటీ ప్రశ్న!
Updated : May 18, 2021
బిగ్ బాస్ బ్యూటీ తేజస్వి మదివాడకు సోషల్ మీడియాలో ఉన్న ఫాలోయింగ్ గురించి అందరికీ తెలిసిందే. బిగ్ బాస్ షోకి రాకముందు సినిమాల్లో చిన్న చిన్న పాత్రలు పోషించిన తేజస్వికి హీరోయిన్ గా మాత్రం అవకాశాలు రాలేదు. బిగ్ బాస్ షోతో ఆమె ఇమేజ్ పూర్తిగా మారిపోయింది. అయితే బిగ్ బాస్ షోతో ఎంత క్రేజ్ వచ్చిందో.. అంతే నెగెటివిటీను కూడా మూటగట్టుకుంది. మొత్తానికి ఈ షోతో తేజస్వికి మంచి చెడు రెండూ జరిగాయి.
ఈ షో తరువాత అమ్మడుకు 'లాఫ్టర్ చాలెంజ్' అంటూ బ్రహ్మానందంతో కలిసి ఓ షో చేసే ఛాన్స్ వచ్చింది. కానీ ఈ షోకి సరైన టీఆర్పీ రాక మధ్యలోనే ఆపేశారు. ఆ తరువాత 'కమిట్మెంట్' అనే సినిమాలో నటించింది. కానీ ఇప్పటివరకు ఆ సినిమా ప్రేక్షకుల ముందుకు రాలేదు. తన నిజజీవితంలో ఎదుర్కొన్న ఘటనలే ఈ సినిమాలో ఉన్నాయంటూ పబ్లిక్ గా చెప్పింది తేజస్వి. ఇలా ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అవుతూనే ఉంది.
ఎప్పటికప్పుడు తన హాట్ ఫోటోలను ఇన్స్టాగ్రామ్ లో షేర్ చేసే ఈ బ్యూటీ కాసేపటి క్రితం బికినీ ధరించి ఉన్న ఓ ఫోటోను పోస్ట్ చేసింది. 'ఇంకెప్పుడు మళ్లీ మనం ఫ్రీ అవుతాం' అంటూ పాండమిక్ పరిస్థితిని ఉద్దేశిస్తూ క్యాప్షన్ ఇచ్చింది. క్యాప్షన్ సంగతేమో కానీ ఈ ఫొటోలో తేజస్వి హాట్నెస్ కి యూత్ ఫిదా అయిపోయింది. బీచ్ ఒడ్డున ఆమె తీసుకున్న ఈ ఫోటో ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.