English | Telugu

పెళ్లిపై క్లారిటీకి వ‌చ్చిన సుధీర్‌!

మ్యాజిక్ షోలు చేసుకుంటూ కెరీర్ ఆరంభించిన సుధీర్ కి కొన్ని ఛానెల్స్ లో పని చేసే ఛాన్స్ వచ్చింది. అలా తెలుగు ప్రేక్షకుల గుర్తింపు అందుకున్నాడు. ఆ సమయంలోనే వేణు వండర్స్ టీమ్ ద్వారా 'జబర్దస్త్' షోలోకి ఎంట్రీ ఇచ్చాడు. అలా వచ్చిన చాలా తక్కువ సమయంలోనే టీమ్ లీడర్ గా ఎదిగి దూసుకుపోతున్నాడు. కమెడియన్ గానే కాకుండా.. సింగర్ గా, డాన్సర్ గా మంచి పేరు తెచ్చుకున్నాడు సుడిగాలి సుధీర్. దీంతో అతడి ఫాలోయింగ్ కూడా బాగా పెరిగిపోయింది.

యాంకర్ రష్మీతో సుధీర్ ప్రేమాయణం సాగిస్తున్నాడనే వార్తల వలన అతడు మరింత పాపులర్ అయ్యాడు. ఇప్పటికే కొన్ని సినిమాల్లో మంచి పాత్రలు చేసిన సుధీర్ కి హీరోగా మాత్రం సక్సెస్ రాలేదు. ఆ మధ్య 'సాఫ్ట్‌వేర్ సుధీర్' అనే సినిమాలో నటించాడు. ఆ తరువాత 'త్రీ మంకీస్' చేశాడు. ఈ రెండూ వర్కవుట్ కాలేదు. హీరోగా సక్సెస్ కాలేకపోయినా.. తన ప్రయత్నాలు మాత్రం మానుకోలేదు. 'కాలింగ్ సహస్ర' అనే థ్రిల్లర్ సినిమాలో నటిస్తున్నాడు. అరున్ విక్కిరాలా డైరెక్ట్ చేస్తోన్న ఈ సినిమా షూటింగ్ కరోనా కారణంగా వాయిదా పడింది.

అయితే ఈ సినిమా కోసం సుధీర్ ఎన్నో కఠిన నిర్ణయాలు తీసుకుంటున్నాడట. ఇందులో భాగంగానే అతడు సిక్స్ ప్యాక్ కూడా చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమాలో అతడు కొత్త లుక్ తో సిక్స్ ప్యాక్ తో కనిపించబోతున్నాడు. ఇదిలా ఉండగా.. కొద్దిరోజులుగా సుధీర్ పెళ్లి చేసుకోబోతున్నాడంటూ వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ఈ విషయంపై క్లారిటీ ఇచ్చిన అత‌ను మరో రెండేళ్ల వరకు బ్యాచిలర్ లైఫ్ ను ఎంజాయ్ చేయాలని డిసైడ్ చేసుకున్నట్లు వెల్లడించాడు.