English | Telugu

ల‌వ్ ఫెయిల్యూర్‌పై ఓపెన్ అయిన న‌వ్య స్వామి!

ఈ మధ్య కాలంలో బుల్లితెర నటీనటులకు క్రేజ్ బాగా పెరిగిపోతుంది. సినీ సెలబ్రిటీల రేంజ్ లో ప్రేక్షకులు వారిని ఆరాధిస్తున్నారు. అలా భారీ పాపులారిటీ సంపాదించిన వారిలో నవ్య స్వామి ఒకరని చెప్పుకోవచ్చు. హీరోయిన్ రేంజ్ లో గ్లామర్, చక్కటి అభినయంతో ప్రేక్షకుల మనసులను దోచుకుంది ఈ బ్యూటీ. 'నా పేరు మీనాక్షి', 'ఆమె కథ' సీరియల్స్ తో క్రేజ్ తెచ్చుకున్న ఈమె తాజాగా 'అలీతో సరదాగా' షోలో పాల్గొంది.

తాజాగా ఈ షోకి సంబంధించిన ప్రోమోను విడుదల చేశారు. ఈ వీడియోలో నవ్య స్వామి ఎమోషనల్ అవుతూ తన వ్యక్తిగత విషయాలను పంచుకుంది. తాను కరోనా బారిన పడ్డ సమయాన్ని జీవితంలో మర్చిపోలేనని చెప్పింది. తను గేటెడ్ కమ్యూనిటీలో ఉండడం వలన.. ఎవరినీ రానివ్వలేదని.. ఆ సమయంలో తనకు తోడుగా ఎవరూ లేకపోవడంతో ఒంటరిగా ఫీలైనట్లు.. బాగా ఏడ్చేశానని చెప్పుకొచ్చింది. ఇక తనకు ఇంటి పనులు చేసుకోవడం నచ్చుతుందని చెప్పింది.

ఇదే షోలో అలీ.. నవ్య బ్రేకప్ గురించి ప్రశ్నించాడు. దానికి ఆమె ఒకప్పుడు బ్యాడ్ రిలేషన్ లో ఉన్నట్లు.. కానీ తరువాత బ్రేకప్ అయిందని.. ఇప్పుడు కాంటాక్ట్ లో లేనని క్లారిటీ ఇచ్చింది. అలానే కెరీర్ ఆరంభంలో ఓ ఈవెంట్ మేనేజర్ తో గొడవైన విషయాన్ని అలీ ప్రస్తావించగా.. సదరు మేనేజర్ ని చచ్చేట్లు కొట్టానని చెప్పింది. కానీ దాని రీజన్ మాత్రం చెప్పలేదు. బహుశా ఫుల్ ఎపిసోడ్ లో చెప్పి ఉంటుందేమో చూడాలి! ఈ ప్రోమో వీడియో నెట్టింట బాగా సంద‌డి చేస్తోంది.