English | Telugu

"ఆ వీడియోలు బయటపెట్టనా?".. రవికి బ్లాక్‌మెయిల్!

యాంకర్ రవి సోషల్ మీడియాలో ఎంత యాక్టివ్‌గా ఉంటాడో మ‌న‌కు తెలుసు. తన భార్యతో, పాపతో కలిసి యాంకర్ రవి పలు వీడియోలు చేస్తూ వాటిని సోషల్ మీడియాలో షేర్ చేస్తుంటాడు. రీసెంట్‌గా తన కూతురు వియా కోసం రవి వంటవాడిగా మారిపోయాడు. స్పెషల్ వంటకాలు చేస్తూ.. కూతురికి తినిపిస్తూ ఆమె మీద ప్రేమను కురిపిస్తున్నాడు. ఇదిలా ఉండగా.. ఇటీవ‌ల‌ రవి షేర్ చేసిన ఓ వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది.

'మగువా మగువా' అనే పాట స్పూష్‌కు అత‌ను ఓ రీల్ వీడియో చేశాడు. 'పురుషా పురుషా' అంటూ వచ్చిన పేరడీ పాటకు రవి ఓ రీల్ వీడియో చేశాడు. ఇందులో ఇంట్లో పనులన్నీ తానొక్కడే చేస్తున్నట్లుగా.. తెగ కష్టపడుతున్నట్లుగా బిల్డప్ ఇచ్చాడు. ఇల్లు శుభ్రం చేయడం, బట్టలు ఉతకడం, వంటలు చేయడం, పాపను రెడీ చేయడం.. ఇలా అన్ని పనులు తనే చేసినట్లుగా చెప్పుకొచ్చాడు. అంతేకాదు, "ఈ పోస్ట్‌ను క‌ష్ట‌ప‌డి ప‌నిచేసే నా 'మ‌గ‌జాతి ఆణిముత్యాలు'కు అంకితం చేస్తున్నాను. ఆడ‌వాళ్లు గొప్ప‌.. మ‌గ‌వాడు కాదు త‌క్కువ‌!!" అంటూ దానికి కాప్ష‌న్ పెట్టాడు.

ప్రస్తుతం ఈ వీడియో వైరల్ అవుతోంది. ఈ వీడియోపైనా, అందులో రవి యాక్టింగ్ పైనా లేడీ యాంకర్లు వర్షిణి, భాను శ్రీ, వింధ్య ఇలా అందరూ కౌంటర్లు వేశారు. "ఇంట్లో ఖాళీగా సోఫాలో కూర్చొని టీవీ చూడటం తప్ప ఇంకేం చేయవు.. నువ్వు ఇన్ని పనులు చేశావా?" అంటూ సెటైర్లు వేశారు. మరికొందరు "నీ భార్య నిత్యతో పనులు చేయించి నువ్వు రీల్స్‌ అప్‌లోడ్‌ చేస్తున్నావా!? అంటూ పరువు తీసేశారు. ఈ వీడియోపై రవి భార్య నిత్య కూడా స్పందించింది. "మేకింగ్ వీడియో బయటపెట్టనా..? అసలు జరిగింది ఏంటో వీడియో బయటపెట్టమంటావా..?" అంటూ రవిని బెదిరించింది. 'ఏం చేసినా సరే.. మా ఉద్యమం ఆగదంటూ' రవి కామెంట్ పెట్టాడు.

Podarillu : భూషణ్ మాటలు విని మహాని కొట్టిన ప్రతాప్.. తను ఏం చేయనుంది!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పోదరిల్లు'(Podarillu).ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -20 లో.....మీరు ఎవరికీ చెప్పకుండా పారిపోండి అని మహాకి చక్రి సలహా ఇస్తాడు. ఏం మాట్లాడుతున్నావ్ వాడికోసం మా నాన్న పరువు తియ్యాలా అని చక్రిపై మహా కోప్పడుతుంది. మహా తన గదిలోకి వెళ్లి.. మా నాన్న నన్ను చాలా బాగా చూసుకున్నాడు. అలాంటిది తనని మోసం చెయ్యలేనని మహా అనుకుంటుంది. అప్పుడే మహాకి భూషణ్ ఫోన్ చేస్తాడు. చిరాకుగా ఫోన్ పక్కన పెడుతుంది మహా. మళ్ళీ మళ్ళీ భూషణ్ ఫోన్ చేస్తుంటే ఫోన్ కట్ చేస్తుంది. ఏంటి నా ఫోన్ కట్ చేస్తుందా అని హారికకి ఫోన్ చేస్తాడు భూషణ్.