English | Telugu

ఎలాంటి వీడియోలు పెట్టాలో పునర్నవికి చెప్ప‌రాదూ..!

బిగ్ బాస్ కంటెస్టెంట్లకు సోషల్ మీడియాలో మంచి క్రేజ్ ఉంటుంది. బిగ్ బాస్ షో ద్వారా గుర్తింపు తెచ్చుకున్న చాలా మంది సోషల్ మీడియాలో సెలబ్రిటీలుగా చెలామణి అవుతున్నారు. అయితే అందులో కొంతమందికి సినిమా అవకాశాలు వస్తుంటాయి. కొందరు మాత్రం సోషల్ మీడియాకే పరిమితమవుతుంటారు. ముఖ్యంగా ఈ మధ్య చాలా మంది బిగ్ బాస్ కంటెస్టెంట్ లు యూట్యూబ్ మీద పడ్డారు. రకరకాల వీడియోలు షేర్ చేస్తూ రచ్చ చేస్తున్నారు.

యూట్యూబ్ లో పలు రకాల వీడియోలు షేర్ చేస్తూ బాగానే సంపాదిస్తున్నారు. ఇప్పటికే బిగ్ బాస్ సీజన్ 3, సీజన్ 4 లో చాలా మంది కంటెస్టెంట్లు యూట్యూబ్ ఛానెల్స్ పెట్టి దుమ్ములేపుతున్నారు. శ్రీముఖి, శివజ్యోతి, హిమజ, అషురెడ్డి, రోహిణి ఇలా చాలా మంది సొంతంగా యూట్యూబ్ ఛానెల్స్ మొదలుపెట్టారు. నాల్గో సీజన్ లో పాల్గొన్న లాస్య, సుజాత, అరియనా, అవినాష్, మెహబూబ్, సోహెల్ ఇలా అందరూ సెపరేట్ ఛానెల్స్ ఓపెన్ చేశారు. ఇప్పుడు పునర్నవి భూపాలం వంతు వచ్చింది.

ఈ మేరకు తన అభిమానుల అభిప్రాయాన్ని అడిగి తెలుసుకుంది. మాములుగా అయితే పునర్నవి యోగా వీడియోలు, ఆసనాల ఉపయోగాలు, బ్యూటీ టిప్స్ కి సంబంధించిన వీడియోలను ఇన్స్టాగ్రామ్ లో షేర్ చేస్తూ వస్తోంది. ఇప్పుడు యూట్యూబ్ లో ఎంట్రీ ఇవ్వాలని చూస్తుంది. ఈ క్రమంలో ఎలాంటి వీడియోలు పెట్టాలి..? వీక్లీ వ్లాగ్స్ పెట్టాలా..? లైఫ్ స్టైల్ కి సంబంధించినవి పెట్టాలా..? అని తన ఫ్యాన్స్ ను అడిగి తెలుసుకుంది.