English | Telugu
బిగ్ బాస్ బ్యూటీ.. మోస్ట్ డిజైరబుల్ ఉమన్ ఆన్ టీవీ!
Updated : May 31, 2021
బిగ్ బాస్ సీజన్ 4 లో కంటెస్టెంట్ గా పాల్గొన్న దివి వడ్త్యకు అరుదైన గౌరవం దక్కింది. హైదరాబాద్ టైమ్స్ ఎంపిక చేసిన 2020 సంవత్సరంలో టెలివిజన్ రంగంలో అత్యంత ప్రతిభను చాటిన సెలబ్రిటీల జాబితాలో దివికి చోటు దక్కింది. ఈ సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడింది. టీవీ రంగంలో మోస్ట్ డిజైరబుల్ ఉమన్ గా ఎంపికయ్యావంటూ టైమ్స్ ఆఫ్ ఇండియా నుండి కాల్ రావడం గొప్ప అనుభవమని.. అలాంటి కాల్ వస్తుందని కలలో కూడా ఊహించలేదని చెప్పింది.
ఆ వార్త వినగానే నమ్మలేకపోయానని.. యాక్సెప్ట్ చేయడానికి కాస్త సమయం పట్టిందంటూ దివి తెలిపింది. ఇతర నటీనటుల కంటే భిన్నంగా ఉండటానికి తన అందం మాత్రమే కారణం కాదని.. తన క్యారెక్టర్ ను ఇష్టపడి ప్రజలు అభిమానిస్తున్నారంటూ చెప్పుకొచ్చింది. ఈ ఘనతను సాధించడం చాలా ఎగ్జైటింగ్ గా ఉందని.. ఎంతో ఆనందంగా ఉందంటూ తన సంతోషాన్ని మీడియాతో పంచుకుంది.
సినిమా ఇండస్ట్రీలో అవకాశాల కోసం ఎదురుచూస్తున్నట్లు చెప్పింది. ఇటీవల స్పార్క్ ఓటీటీలో రిలీజైన 'క్యాబ్ స్టోరీస్'లో దివి నటించింది. ఈ సిరీస్ లో తన నటనకు మంచి ప్రశంసలు వస్తున్నాయని తెలిపింది. చిరంజీవితో కలిసి ఓ సినిమాలో నటించినట్లు.. అలానే కొన్ని వెబ్ సిరీస్ లలో నటిస్తున్నట్లు చెప్పుకొచ్చింది. దివి మోస్ట్ డిజైరబుల్ ఉమన్ టైటిల్‌ను సొంతం చేసుకొన్న క్రమంలో ఈమెకి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.