English | Telugu

"వీడియోను కాదు, మ్యాట‌ర్‌ను సీరియ‌స్‌గా తీసుకోండి".. సుమ వీడియో వైరల్!

యాంకర్ సుమ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటారు. గతేడాది లాక్ డౌన్ నుండి ఆమె తనకు సంబంధించిన వ్యక్తిగత విషయాలను సోషల్ మీడియాలో పంచుకుంటూ వార్తల్లో నిలుస్తున్నారు. ప్రస్తుతం సినిమా ఇండస్ట్రీ ఎలాంటి పరిస్థితుల్లో ఉందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. షూటింగ్ లు లేక ఎక్కడి పనులు అక్కడే ఆగిపోవడంతో ఎంతోమంది ఉపాధి లేక ఇబ్బంది పడుతున్నారు. ప్రస్తుతం ఉన్న పరిస్థితి, కళాకారుల ఆవేదన తెలిసేలా సుమ ఓ ఫన్నీ వీడియోను రూపొందించారు.

వీడియో సరదాగా ఉన్నప్పటికీ.. అందులో ఆమె చెప్పిన విషయం మాత్రం చాలా డెప్త్‌తో ఉంది. ఈ వీడియో సుమ తన మేకప్ కిట్ ను బయటకు తీశారు. తన మొహానికి మేకప్ వేసుకుంటూ.. "చాలా రోజులు అయింది కదా..? పని చేస్తున్నాయో లేదో అని తెలుసుకోవడానికి మేకప్ వేసుకుంటున్నా"నని సుమ చెప్పుకొచ్చారు. అయితే ఈ వీడియోను షేర్ చేయడంతో పాటు కొన్ని విషయాలను చెప్పుకొచ్చారు. ఈ వీడియోను అంత సీరియస్ గా తీసుకోకుండా చూడాలని కోరారు. కానీ చెప్పే మ్యాటర్‌ను మాత్రం సీరియస్ గా వినండని అన్నారు.

''మా పొట్ట నింపేది ఎంటర్టైన్మెంట్ ఇండస్ట్రీ. మా కడుపు నిండాలన్నా, ఇంత అన్నం దొరకాలన్నా.. మేమంతా పని చేయాలి. యాక్టర్లు, యాంకర్లు, దర్శకులు, నిర్మాతలు, సంగీత దర్శకులు, కెమెరా మెన్, లైట్ మెన్, ఫైట్ మాస్టర్స్, ఎడిటర్స్, మేకప్ మెన్, హెయిర్ స్టైలిస్ట్, ఆర్ట్, ప్రొడక్షన్ ఇలా అందరూ సెట్స్ మీదకు రావాలి. మేమంతా మా పనులను మొదలుపెట్టాలి.. కుటుంబాలను పోషించాలని ఎంతో ఆశగా ఎదురుచూస్తున్నాం.'' అంటూ వీడియోకు క్యాప్షన్ గా రాసుకొచ్చారు.

Podarillu : భూషణ్ మాటలు విని మహాని కొట్టిన ప్రతాప్.. తను ఏం చేయనుంది!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పోదరిల్లు'(Podarillu).ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -20 లో.....మీరు ఎవరికీ చెప్పకుండా పారిపోండి అని మహాకి చక్రి సలహా ఇస్తాడు. ఏం మాట్లాడుతున్నావ్ వాడికోసం మా నాన్న పరువు తియ్యాలా అని చక్రిపై మహా కోప్పడుతుంది. మహా తన గదిలోకి వెళ్లి.. మా నాన్న నన్ను చాలా బాగా చూసుకున్నాడు. అలాంటిది తనని మోసం చెయ్యలేనని మహా అనుకుంటుంది. అప్పుడే మహాకి భూషణ్ ఫోన్ చేస్తాడు. చిరాకుగా ఫోన్ పక్కన పెడుతుంది మహా. మళ్ళీ మళ్ళీ భూషణ్ ఫోన్ చేస్తుంటే ఫోన్ కట్ చేస్తుంది. ఏంటి నా ఫోన్ కట్ చేస్తుందా అని హారికకి ఫోన్ చేస్తాడు భూషణ్.