English | Telugu

అనసూయను చాలా దూరం వెనక్కి నెట్టేసిన రష్మీ!

బుల్లితెరపై యాంకర్ అనసూయకి ఉన్న ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. సోషల్ మీడియాలో కూడా ఆమెకి లక్షల ఫాలోవర్లు ఉన్నారు. కొన్నేళ్లుగా ఆమె హైదరాబాద్ మోస్ట్ డిజైరబుల్ ఉమెన్ జాబితాలో టాప్ 10లో ఉన్నారు. కానీ 2020 ఏడాదికి గాను మోస్ట్ డిజైరబుల్ ఉమెన్ జాబితాలో అనసూయకి టాప్ 10లో కూడా చోటు దక్కలేదు. నిజానికి లాక్‌డౌన్ లో అనసూయ క్రేజ్ మరింత పెరిగింది. కానీ ఆమె ఈసారి 13వ స్థానంతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది.

అనసూయకి 13వ స్థానం దక్కితే రష్మీ గౌతమ్ మాత్రం ఏకంగా టాప్ 4లో నిలవడం గమనార్హం. అనసూయతో పోలిస్తే రష్మీకు సోషల్ మీడియాలో పాపులారిటీ అంతకంతకూ పెరుగుతోంది. కనీసం వచ్చే ఏడాదైనా అనసూయ టాప్ 10 నిలుస్తుందేమో చూడాలి. ఇటీవల అనసూయ నటించిన 'థాంక్యూ బ్రదర్' సినిమా 'ఆహా'లో విడుదలైంది. కానీ ఈ సినిమాకి ఆశించిన స్థాయిలో రెస్పాన్స్ రాలేదు.

ప్రస్తుతం అనసూయ.. 'పుష్ప' సినిమాలో నటిస్తున్నారు. సుకుమార్ డైరెక్ట్ చేస్తున్న ఈ మూవీలో కథ ప్రకారం ఆమె సునీల్ భార్య పాత్రలో కనిపించనున్నారు. రీసెంట్ గా 'పుష్ప' సినిమా రెండు భాగాలుగా విడుదల చేస్తున్నట్లు అనౌన్స్ చేశారు. దీనికి తగ్గట్లుగానే అనసూయ రోల్ ని కూడా పొడిగిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. మరి ఈ సినిమాతో అనసూయకి ఎలాంటి గుర్తింపు వస్తుందో చూడాలి!