English | Telugu

"మీలాంటి గాళ్‌ఫ్రెండ్ కావాలి".. సునీతకు షాకిచ్చిన బుడ్డోడు!

సింగర్ సునీత ఇప్పుడు బుల్లితెరపై కూడా సందడి చేస్తున్నారు. 'డ్రామా జూనియర్స్' షోతో మళ్లీ తన అభిమానులకు దగ్గరవుతున్నారు. ఈ షోలో పిల్లలు చేసే స్కిట్లు చూసి సునీత బాగా నవ్వుతుంటారు. ఒక్కోసారి వారు చేసే స్కిట్లు, ఇచ్చే సందేశాలు చూసి ఎమోషనల్ అవుతుంటారు. అలా స్టేజ్ మీద కన్నీళ్లు పెట్టుకున్న సందర్భాలు చాలానే ఉన్నాయి. తాజాగా సునీతకు ఓ బుడ్డోడు షాకిచ్చాడు. నీలాంటి గర్ల్ ఫ్రెండ్ కావాలంటూ సునీతను అడిగేశాడు.

దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు బాగా వైరల్ అవుతోంది. సునీత రెండో పెళ్లి చేసుకున్న తరువాత సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటున్నారు. తన ఫాలోవర్లతో తరచూ టచ్ లో ఉంటున్నారు. ప్రతిరోజు రాత్రి 8 గంటలకు లైవ్ లోకి వచ్చి పాటలను ఆలపిస్తున్నారు. ఆ విధంగా ప్రేక్షకులను కొంతవరకు ఆనందింప‌జేయొచ్చనేది సునీత ఆలోచన. ఇదిలా ఉండగా ఇప్పుడు సునీత 'డ్రామా జూనియర్స్' షోలో సందడి చేస్తున్నారు.

పిల్లలతో కలిసి సునీత, రేణు దేశాయ్, ఎస్వీ కృష్ణారెడ్డి చేసే అల్లరి అందరినీ ఆకట్టుకుంటోంది. తాజాగా ఓ చిన్న‌పిల్లాడు ఆ షోలో 'మన్మథుడు' సినిమా స్పూఫ్ చేశాడు. ఆ స్కిట్ ను అందరూ ఎంజాయ్ చేశారు. స్కిట్ అనంతరం సునీత మాట్లాడుతూ.. ''నీకు గర్ల్ ఫ్రెండ్ కావాలంటే ఎలా ఉండాలో చెప్పు..?'' అంటూ ఆ బుడ్డోడిని ప్రశ్నించగా.. దానికి ఆ పిల్లాడు "మీలా ఉండాలి" అని చెప్పి షాకిచ్చాడు. ఆ తరువాత రేణు దేశాయ్ ఆ పిల్లాడితో కలిసి స్టేజ్ మీద డాన్స్ వేశాడు.

Brahmamudi Serial : దుగ్గిరాల కుటుంబం హ్యాపీ.. రుద్రాణి కన్నింగ్ ప్లాన్ అదేనా!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ బ్రహ్మముడి (Brahmamudi). ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్-931 లో.. మినిస్టర్ కి పాప పుడుతుంది. ఆపరేషన్ తర్వత డాక్టర్ బయటకు వస్తాడు. మీకు పాప పుట్టింది అని డాక్టర్ అనగానే.. మినిస్టర్ ఫుల్ హ్యాపీగా ఉంటాడు. కానీ పాపకి ఒక ప్రాబ్లమ్ ఉందని డాక్టర్ చెప్తాడు. ఏ ప్రాబ్లమ్ ఉన్నా ఆపరేషన్ చేయించండి.. ఎంతమంది డాక్టర్ లు ఐనా , ఎక్కడి నుంచి అయినా తీసుకొచ్చి అయినా ఆపరేషన్ చేపించండి అని మినిస్టర్ అనగానే.. ఇప్పుడు చేయకూడదు.. పాప వెయిట్ తక్కువ ఉంది.. పాప పెరిగాక ఆపరేషన్ చేయాలని డాక్టర్ చెప్తాడు. వాళ్ళిద్దరూ మాట్లాడుకునేదంతా రుద్రాణి చూస్తుంది.

Illu illalu pillalu Serial:  అమూల్య ఎంగేజ్ మెంట్ ఆపడానికి భద్రవతి ప్లాన్.. భాగ్యం ఏం చేయనుంది!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ ఇల్లు ఇల్లాలు పిల్లలు (Illu illalu pillalu). ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్-370 లో.. దేవుడా ఏ ఆటంకం లేకుండా ఈ నిశ్చితార్థం సవ్యంగా జరిగేలా చూడు అని దేవుడికి మొక్కుకుంటుంది వేదవతి. అప్పుడే దేవుడి దగ్గరున్న దీపాలు ఆరిపోతాయి. అయ్యో ఇదేంటి దీపాలు ఆరిపోయాయేంటని వేదవతి టెన్షన్ పడుతుంది. మరోవైపు కామాక్షి భర్త కోసం గుమ్మం దగ్గర ఎదురుచూస్తుంటుంది. అప్పుడే తిరుపతి చూస్తాడు. ఏంటమ్మా అని అడుగుతాడు. మా ఆయన కోసం ఎదురుచూస్తున్నానని కామాక్షి చెప్తుంది. అప్పుడే కామాక్షి భర్త ఆటోలో ఎంట్రీ ఇస్తాడు.