‘బాలయ్య బాలయ్య’ అంటూ కిర్రాక్ సాంగ్ తో అల్లాడించిన ఉష ఉత్తుప్
ఇండియన్ ఐడల్ తెలుగు పోటీలు మంచి రసవత్తరంగా సాగుతున్నాయి. ప్రేక్షకులు కూడా వాళ్ళ వాళ్ళ వోటింగ్ ఇచ్చేసారు. ఇక జూన్ 10 న సెమీ ఫైనల్స్ జరగబోతున్నాయి . బాలయ్య బర్త్ డే కూడా ఇదే రోజు కావడం విశేషం. ఐతే ఈ షోలో శ్రీనివాస్ పాటకి అఖండ పాట పాడి స్టేజిని ఒక్కసారిగా డివోషనల్ ప్లేస్ గా మార్చేశాడు. ఇక ఈ పాట ఐపోగానే బాలయ్యబాబు, ఉష ఉత్తుప్, నిత్యామీనన్, కార్తిక్, థమన్ అంతా నిలబడి చప్పట్లు కొట్టారు శ్రీనివాస్ కి. థమన్ లో ఆ సదాశివుడు పూనాడేమో అనిపిస్తుంది ఈ పాట విన్నప్పుడల్లా థ్యాంక్యూ తమ్ముడు అంటూ తమన్ కి చెప్తాడు.