English | Telugu
ఆర్య అరెస్ట్.. ప్రాణ త్యాగానికి సిద్ధమైన అను!
Updated : Jun 10, 2022
బుల్లితెరపై ప్రసారం అవుతున్న సీరియల్ `ప్రేమ ఎంత మధురం`. గత కొన్ని నెలలుగా మహిళా ప్రేక్షకుల్ని విశేషంగా ఆకట్టుకుంటూ విజయవంతంగా ప్రసారం అవుతోంది. పాపులర్ హిందీ సీరియల్ ఆధారంగా ఈ సీరియల్ ని తెలుగులో రీమేక్ చేశారు. `బొమ్మరిల్లు` ఫేమ్ శ్రీరామ్ వెంకట్ ప్రధాన పాత్రలో నటించి ఈ సీరియల్ ని నిర్మించారు. వర్ష హెచ్.కె. కీలక పాత్రలో నటించింది. ఇతర పాత్రల్లో జయలలిత, రామ్ జగన్, విశ్వమోహన్, బెంగళూరు పద్మ, అనూష సంతోష్, జ్యోతిరెడ్డి, రాధాకృష్ణ, కరణ్, ఉమా దేవి, మధుశ్రీ, సందీప్ నటించారు.
రాగసుధ పక్కా ప్లాన్ ప్రకారం ఆర్య వర్థన్ ని ఇరికిస్తుంది. గవర్నర్ కాన్వాయ్ కి అడ్డంగా నిలిచి తనకు న్యాయం జరక్కపోతే ఆత్మాహుతి చేసుకుంటానని నాటకం ఆడటంతో గవర్నర్ రాగసుధ మాటలని నమ్మేస్తాడు. తను కోరుకున్నట్టే మూడు రోజుల పాటు ఆర్య వర్థన్ ని కస్టడీకి తీసుకోవాలని పోలీసు శాఖకు ఆదేశాలు జారీ చేస్తారు. ఈ నేపథ్యంలో అనుతో కేసు విత్ డ్రా చేయించి రాగసుధపై కేసు పెట్టాలని ప్రయత్నించిన ఆర్య ప్రయత్నలు వృథా అవుతాయి. స్టేషన్ లోనే వున్న ఆర్యని గౌరవ కష్టడీకి తీసుకుంటున్నట్టుగా కమీషనర్ మీడియాకు వివరిస్తాడు.
అనంతరం ఫార్మాలిటీస్ అన్నీ పూర్తవడంతో ఆర్యవర్ధన్ సెల్ లోకి వెళుతుండగా 'ఏదో ఒకటి చేయండి సార్.. మీరు మాత్రం ఇక్కడ వుండటానికి వీల్లేదు' అని ఆర్యతో అను అంటుంది. ఆ మాటలకు ఆర్య .. నీరజ్ ని పిలిచి అనుని ఇంటికి తీసుకెళ్లమంటాడు. దీంతో చేసేది లేక అక్కడున్న ఓ పోలీస్ నుంచి గన్ లాక్కున్న అను తన తలకు గురి పెట్టుకుని 'ఎవరైనా దగ్గరికి వస్తే నన్ను నేను షూట్ చేసుకుంటా' అంటుంది. ఈ హఠాత్పరిణామానికి పోలీసులు ఎలా రియాక్ట్ అయ్యారు? .. ఆర్య కేసు ఎలాంటి మలుపులు తిరిగింది? అన్నది ఈ రోజు ఎపిసోడ్ లో చూడాల్సిందే.