English | Telugu

వినాయకుడికి విశిష్ట అభిషేకంతో దోషం తొలగిపోతుందా ?

రత్తమ్మను నిర్దోషి అని శ్యామా ప్రూవ్ చేసి తనకు అండగా నిలబడుతుంది. ఐశ్వర్య ఫ్యాక్టరీలో కారప్పొడులను ప్యాక్ చేస్తూ శ్యామా మీద కారాలు మిరియాలు నూరుతూ ఉంటుంది. మరో పక్క వసంతకు శ్యామా ఐశ్వర్య చేసిన పని గురుంచి కాకుండా ఎవరో కిట్టని వాళ్ళు రత్తమ్మ మీద పగ తీర్చుకోవడానికి ప్లాన్ చేసారంటూ జరిగిన విషయం చెప్తుంది. అలాంటి వాళ్ళను అందరి ముందు నిలబెట్టి ఇంకోసారి అలా జరగకుండా చూడాలంటూ ఐశ్వర్య ముందే శ్యామాకి చెప్తుంది.

వెంటనే ఐశ్వర్య గదిలోకి వెళ్లి శ్యామా మీద ఉన్న కోపంతో వస్తువుల్ని పగలగొడుతుంది. మరో పక్క వసంత వాళ్ళు శ్యామా , అఖిల్ ఫస్ట్ నైట్ ఏర్పాట్ల కోసం గురువుగారితో మాట్లాడతారు. ఐతే ఇద్దరి జాతకాలు బాగున్నాయి కానీ చిన్న లోపం ఉందని చెప్తారు. ఆ లోపం పోవాలంటే విఘ్నేశ్వరుడికి విశిష్ట అభిషేకం చేయాలనే విషయం చెప్పి ఆ కార్యక్రమానికి తప్పనిసరిగా వెళ్లేలా ఏర్పాట్లు చేసుకోవాలని వసంత శ్యామాకు చెప్తుంది. మిగతా హైలైట్స్ కోసం ఈరోజు మధ్యాహ్నం జీ తెలుగులో ప్రసారమయ్యే కృష్ణతులసి సీరియల్ లో చూడొచ్చు.