English | Telugu
హైపర్ ఆదికి వర్షిణి లవ్ ప్రపోజ్!
Updated : Jun 10, 2022
జబర్దస్త్ కామెడీ షో ద్వారా వెలుగులోకి వచ్చిన స్టార్ కమెడియన్, రైటర్ హైపర్ ఆది. తనదైన టైమింగ్ తో హైపర్ గా పంచ్ లు పేల్చే ఆది గురించి లవ్ ఎఫైర్ లు వినిపించడం చాలా తక్కువే. అయితే తాజాగా మాత్రం అతనిపై లవ్ ఎఫైర్ వార్తలు ఈ మధ్య జోరుగా వినిపిస్తున్నాయి. తాజాగా యాంకర్ వర్షిణి సోషల్ మీడియా వేదికగా హైపర్ ఆదికి లవ్ ప్రపోజ్ చేయడం ఆసక్తికరంగా మారింది. `జబర్దస్త్` షో లో చాలా మంది జంటల మధ్య పబ్లిసిటీ, షో కనెక్ట్ కావడం కోసం లవ్ ఎఫైర్ లనే నాటకం ఆడుతున్న విషయం తెలిసిందే. అయితే వర్షిణి, హైపర్ ఆది కలిసి ఏ షోలోనూ కనిపించని నేపథ్యంలో వర్షిణి .. హైపర్ ఆదికి లవ్ ప్రపోజ్ చేయడం ఆసక్తికరంగా మారింది.
భైపర్ ఆది పుట్టిన రోజు సందర్భంగా వర్షిణి సోషల్ మీడియా వేదికగా పెట్టిన పోస్ట్ ఇప్పడు వైరల్ గా మారింది. జబర్దస్త్, ఎక్స్ ట్రా జబర్దస్త్ నుంచి బయటికి చాలా రోజుల క్రితమే బయటికి వచ్చేసిన వర్షిణి ఆ తరువాత `స్టార్ మా`లో ఓంకార్ స్టార్ట్ చేసిన కామెడీ షో `కామెడీ స్టార్స్`కు యాంకర్ గా వ్యవహరించింది. ఆ తరువాత ఏం జరిగిందో తెలియదు కానీ ఆ షో నుంచి కూడా బయటికి వచ్చేసింది. ఆ తరువాత సుమంత్ తో ఓ సినిమా కూడా చేసిన వర్షిణి ప్రస్తుతం ఎలాంటి టీవీ షోలు చేయడం లేదు.
ఇదిలా వుంటే హైపర్ ఆది పుట్టిన రోజు సందర్భంగా వర్షిణి పెంట్టిన పోస్ట్ పలు అనుమానాలు రేకెత్తిస్తోంది. `సెలబ్రేషన్స్ కంటిన్యూస్.. డియర్ ఆది ఐ విష్ యు ఏ వెరీ హ్యాపీ బర్త్ డే.. నువ్వు ఎల్లప్పుడూ నా జీవితంలో వుండాలని.. వుంటావని కోరుకుంటున్నాను. నేను అత్యధికంగా అభిమానించే వ్యక్తి. నా 3 AM ఫ్రెండ్..నా సపోర్ట్ సిస్టమ్. రైటర్ ఆది నువ్వు నాకు కరెక్ట్ రా` అంటూ వర్షిణి సోషల్ మీడియా ఇన్ స్టా వేదికగా చేసిన పోస్ట్ వీరిద్దరి మధ్య సమ్ థింగ్ సమ్ థింగ్ అని కన్ఫర్మ్ చేస్తోంది.
ఈ పోస్ట్ పై నెటిజన్ లు కామెంట్ లు చేస్తున్నారు. నీ లాస్ట్ కామెంట్ చూస్తుంటే డౌట్ గా వుంది. మీరిద్దరు డేటింగ్ లో వున్నారా? అంటూ డైరెక్ట్ గానే అడిగేస్తున్నారు. వర్షిణి మాత్రం ఈ కామెంట్ లపై స్పందించడం లేదు.