English | Telugu
‘తమన్ ని సిక్స్ ప్యాక్ తో చూడాలనుంది’ అన్న అల్లు అరవింద్
Updated : Jun 9, 2022
తమన్ కి సిక్స్ ప్యాక్ ఎప్పుడు వస్తుందా ఎప్పుడు చూద్దామా అని ఉంది అంటూ అల్లు అరవింద్ తెలుగు ఇండియన్ ఐడల్ ప్రెస్ మీట్ స్టేజిపై సరదాగా ఆట పట్టించారు. స్టేజి కింద కూర్చున్న తమన్ మైక్ తీసుకుని సిక్స్ ప్యాక్ లు ఆరు పాటల్లో ఉంటాయి అంటూ ఒక చెణుకును అలా విసిరి అందరిని నవ్వించాడు. ఇక ఈ ప్రోగ్రాంకి జడ్జెస్ గా ఉన్న అందరిని విష్ చేస్తూ శ్రీరామ్ గురుంచి కొన్ని మాటలు చెప్పారు.
శ్రీరామచంద్ర 2010 లో సోనీ టీవీ నిర్వహించిన ఇండియన్ ఐడల్ ప్రోగ్రాం విన్నర్. ఐతే ఆ టైంలో శ్రీరామచంద్ర పెర్ఫార్మన్స్ కి ఫిదా ఐనా అల్లు నిర్మల తన చేత వోట్ చేయించారని ఆనాటి జ్ఞాపకాలను గుర్తుచేసుకున్నారు. ఈ శ్రీరామచంద్ర నాకు అప్పుడు అలా తెలుసు. మళ్ళీ ఇన్నాళ్లకు ఇలా ఆహా ప్రోగ్రాంకి హోస్ట్ గా వచ్చి ఈ షోకి వచ్చే అందరిని ఇలా ఆడించేస్తాడనుకోలేదు అంటూ ఆనందం వ్యక్తం చేశారు. థాంక్యూ శ్రీరామ్ ఇలాగే కంటిన్యూ చెయ్యి అనేసరికి శ్రీరామ్ కూడా హ్యాపీ గా ఫీల్ అయ్యాడు. ఇక ఈ ప్రోగ్రాంని కొత్త కొత్త ఐడియాస్ తో ముందుకు తీసుకెళ్తున్న అందరికి కూడా ఈ స్టేజి ద్వారా ధన్యవాదాలు చెప్పారు.