English | Telugu

'ఆహా' బంపర్ ఆఫర్.. రూ. 99కే సబ్‌స్క్రిప్ష‌న్‌

బుల్లితెర మీద బంపర్ హిట్ షో 'తెలుగు ఇండియన్ ఐడల్'. 'ఆహా'లో స్ట్రీమ్ అయ్యే ఈ కార్యక్రమంస్టార్ట్ చేసిన కొద్ది రోజులకే మంచి రేటింగ్స్ తో ముందుకెళ్తోంది. ఐతే ఈ షో ప్రెస్ మీట్ లో అల్లు అరవింద్ మంచి సర్ప్రైజెస్ అనౌన్స్ చేశారు. ఆ సర్ప్రైజెస్ విషయాన్నీ కూడా చాల వెరైటీగా చెప్పారు. ఆహా ఇప్పటివరకు 29 మిలియన్ డౌన్లోడ్స్ అయ్యింది అనేది సర్ప్రైజ్ కాదు, సుమారు టు మిలియన్ ఆఫ్ సబ్స్క్రైబర్స్ రోజు ఆహాని చూస్తారనే విషయం కూడా సర్ప్రైజ్ కాదు, ఇప్పటి వరకు 30 షోస్ కంప్లీట్ చేసుకుని 31st ఎపిసోడ్ అనేది ఈ నెల 10 న ప్రసారం కాబోతోంది. ఐతే ఈ ఎపిసోడ్ కి ఒక స్పెషాలిటీ ఉంది. అది "అన్స్టాపబుల్ టాప్ ౬" అనే పేరుతో ప్రసారం కాబోతోంది. అన్నారు.

"ఇక 17th న గ్రాండ్ ఫినాలే దుమ్ము రేపబోతోంది. ఆ గ్రాండ్ ఫినాలేలో ఎన్నో సర్ప్రైజెస్ ప్లాన్ చేసాం. ఎక్కువ మొత్తం క్యాష్ ప్రైజెస్ ని కూడా అనౌన్స్ చేయబోతున్నాం. అమౌంట్ ఎంత అనేది ఇప్పుడే చెప్పను. వీటితో పాటు విన్నర్స్ కి రన్నర్స్ కి ఇండస్ట్రీలో ఎలాంటి అవకాశాలు కల్పించాలో కూడా డిసైడ్ చేశాం. ఆ విషయాలన్నీ ఆరోజు రివీల్ చేస్తాం" అని అన్నారు . ఇన్ని సర్ప్రైజెస్ ఉన్న 17న జరగబోయే గ్రాండ్ ఫినాలేని ఎవ్వరూ మిస్ కాకూడదు అనే ఆలోచనతో ఒక సర్ప్రైజ్ ప్లాన్ చేశామన్నారు.

"కొన్ని లక్షల మంది ఈ ప్రోగ్రాంకి వోట్ వేస్తూ వస్తున్నారు కానీ ఇంకా కొంతమంది ఆహాకి మనీ పే చేసి సబ్స్క్రైబ్ చేసుకోలేక ఇబ్బందిపడుతున్న విషయం మా దృష్టికి వచ్చింది. అందుకే ఈ సందర్భంగా కేవలం రూ. 99ల‌కేసబ్స్క్రిప్షన్ తీసుకుని ఈ గ్రాండ్ ఫినాలే చూసే అవకాశాన్ని కల్పిస్తున్నాం. ఐతే ఈ ఆఫర్ అనేది ఒక లిమిటెడ్ పీరియడ్ వరకు మాత్రమే" అంటూ అనౌన్స్ చేశారు. గ్రాండ్ ఫినాలే మాత్రమే కాదు అన్ని ప్రోగ్రామ్స్ ఆహాలో చూడొచ్చు కానీ ఒక నిర్ణీత సమయం వరకే అంటూ "ఇదే బిగ్గెస్ట్ సర్ప్రైజ్ కాబట్టి ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేని వాళ్ళుంటే వెంటనే చేసుకోండి ప్రోగ్రాంని ఎంజాయ్ చేయండి" అంటూ స్వీట్ న్యూస్ చెప్పారు.