English | Telugu
అడివి శేష్ తో బుల్లి తెర నటి మహేశ్వరీ కూతురు హరిణి చిట్ చాట్
Updated : Jun 9, 2022
వదినమ్మ సీరియల్ లో శైలు పాత్రలో టిపికల్ గా నటించి పేరుతెచ్చుకుంది నటి మహేశ్వరీ. ఐతే మహేశ్వరికి చాలా రోజుల తర్వాత షూటింగ్స్ కి కాస్త బ్రేక్ వచ్చేసరికి కూతుర్ని తీసుకుని మేజర్ మూవీకి వెళ్ళింది. కూతురు హరిణికి ఎంతో బాగా నచ్చేసింది ఆ మూవీ. ఏ సినిమాకు వెళ్లినా సగంలోనే వెళ్ళిపోదాం అనే హరిణి ఈ మూవీ మొత్తం చూసింది అంటూ తన యూట్యూబ్ ఛానల్ ద్వారా తన కూతురు ఎక్సయిట్మెంట్ ని నెటిజన్స్ తో షేర్ చేసుకుంది. అంతే కాకుండా బిగ్ సర్ప్రైజ్ ని ప్లాన్ చేసి డైరెక్ట్ గా అడివి శేష్ తో మాట్లాడించింది. మేజర్ మూవీ హీరోని డైరెక్ట్ గా చూసేసరికి మహేశ్వరీ కూతురు చాలా ఫిదా ఐపోయింది.
ఇక ఇద్దరి మధ్య సరదా చిట్ చాట్ జరిగింది. "అంకుల్ మీరు గన్ ఎలా పట్టుకున్నారు భయం వేయలేదా " అనేసరికి గన్ ని ఎలా పేల్చాలో చేత్తో చేసి చూపించారు అడివి శేష్. ఇప్పుడు ఈ వీడియొ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. పెద్దయ్యాక నేను పోలీస్ అవుతా దొంగల్ని కొట్టేస్తా అంటూ దానికి మేజర్ సర్ ఇన్స్పిరేషన్ అని చెప్తుంది హరిణి. ఇక నెటిజన్స్ కూడా తమ కామెంట్స్ ని షేర్ చేసుకున్నారు. చాలా మందికి ఒక ఇన్స్పిరేషన్ గా నిలబడ్డారు, మీరు. మంచి మూవీని సెలెక్ట్ చేసుకున్నారు,హరిణికి మంచి సర్ప్రైజ్ ఇచ్చారు మహేశ్వరీ, అడివి శేష్ తో వ్లోగ్ చేసినందుకు థాంక్స్ అంటూ కామెంట్స్ వరద కురిపించారు.
ఒడిశా నుంచి ఒక చిన్నారి మేజర్ మూవీ ఇన్స్పిరేషన్తో ఆర్మీలో జాయిన్ అవుతానంటూ ఒడియాలో ఒక వీడియొ శేష్ కి పంపింది. ఆ వీడియొ చూసి తనకు చాలా హ్యాపీ అనిపించిందని చెప్పారు. ఇక ఇప్పుడు నేషనల్ డిఫెన్సె అకాడమీ వాళ్ళు కూడా కొత్త రూల్ ప్రకారం ఆర్మీలోకి మహిళలను కూడా తీసుకుంటున్నారని చెప్పారు. ఇలా ఎన్నో విషయాలను అడివి శేష్ ఈ వీడియొలో షేర్ చేసుకున్నారు. మరి మీరు కూడా ఈ వీడియొ చూసేయండి.