English | Telugu
ఓటిటిలోకి ఓంకార్ ఎంట్రీ
Updated : Jun 10, 2022
పాపులర్ టీవీ హోస్ట్ గా, ప్రొడ్యూసర్ గా, ఫిలిం మేకర్ ఐన ఓంకార్ ఓటిటిలోకి ఎంట్రీ ఇవ్వబోతున్నాడు. తెలుగు ఇండియన్ ఐడల్ ని ప్రసారం చేస్తున్న ప్రముఖ ఓటిటి ప్లాట్ఫారం పై అతను తన కొత్త డాన్స్ షో ఒకటి ప్లాన్ చేయబోతున్నట్లు సన్నిహిత వర్గాల సమాచారం. ఓంకార్ గతంలో ఆట, ఛాలెంజ్ వంటి డాన్స్ షోస్ చేసాడు. అవి తర్వాత కాలంలో కొంత కాంట్రావర్సీని మూట గట్టుకున్నాయి. ఆ తర్వాత ఆట జూనియర్స్, డాన్స్ ప్లస్ షోస్ కూడా కండక్ట్ చేసాడు.
ఆ షోస్ మీద కూడా రూమర్స్ వచ్చేసరికి వాటికి బైబై చెప్పి ఇష్మార్ట్ జోడి, సిక్స్త్ సెన్స్, కామెడీ స్టార్స్ ధమాకా అనే షోస్ తో ఫుల్ బిజీ ఐపోయాడు. ఇష్మార్ట్ జోడి సీజన్ 2 తర్వాత ఓటిటి పై ద్రుష్టి పెట్టాడు ఓంకార్ . ఐతే ఓటిటిలో ఒక షోని జులైలో లాంచ్ చేయబోతున్నట్లు తెలుస్తోంది. ఓటిటి వెర్షన్ లో వస్తున్న బిగ్ బాస్ లో హౌస్ మేట్స్ ని ఎంకరేజ్ చేయడానికి ఒక వారం హౌస్ లోకి వెళ్లిన విషయం తెలిసిందే. ఇక ఇప్పుడు కొత్త ప్రోగ్రాం దాని విషయాలు విశేషాలు త్వరలో వెల్లడించనున్నట్లు సమాచారం.