English | Telugu
వేద పై కన్నేసిన కైలాష్.. ఏం జరగబోతోంది?
Updated : Jun 10, 2022
బుల్లితెరపై ప్రసారం అవుతున్న సీరియల్ `ఎన్నెన్నో జన్మల బంధం`. హిందీలో సూపర్ హిట్ అయిన సీరియల్ ఆధారంగా ఈ సీరియల్ ని రీమేక్ చేశారు. గత కొన్ని వారాలుగా చిత్ర విచిత్రమైన మలుపులతో సాగుతూ రొమాంటిక్ సీరియల్ గా ఆకట్టుకుంటోంది. ఓ పాప చుట్టూ సాగే అందమైన కథగా ఈ సీరియల్ ని రూపొందించారు. నిరంజన్, డెబ్జాని మోడక్, మిన్ను నైనిక ప్రధాన పాత్రల్లో నటించారు. ఇతర పాత్రల్లో బెంగళూరు పద్మ, జీడిగుంట శ్రీధర్, ప్రణయ్ హనుమండ్ల, రాజా శ్రీధర్, ఆనంద్, సుమిత్ర పంపన తదితరులు నటించారు.
మాళవికకు బుద్ధి చెప్పే క్రమంలో ఖుషీని వేదకు దత్తత ఇస్తాడు యష్.. కట్ చేస్తే.. ఆ విషయం తలుచుకుంటూ మురిసిపోతూ వుంటుంది వేద. ఇంతలో యష్ అటుగా వస్తాడు. ఏంటీ అని అడిగితే వేద ఏమీ లేదంటుంది. ఆ తరువాత యష్ వెళ్లి పడుకుంటాడు. వేద కూడా పడకుని తనకు థాంక్స్ చెబితే బాగుండేది అని ఫీలవుతూ వుంటుంది. యష్ కూడా వేలం పాటలో తనకు వేద హెల్ప్ చేసిందని, అయితే అది గమనించకుండా తనని ఇబ్బంది పెట్టానని అందుకు తనకు సారీ చెప్పాలని యష్ ఫీలవుతూ వుంటాడు.
కట్ చేస్తే.. దుబాయ్ లో వుంటున్న యష్ బావ కైలాష్ ఇంటికి వస్తాడు. వచ్చీ కాగానే తన బుద్ధిని బయటపెడతాడు. ఆడవాసన తగిలితే రెచ్చిపోయే క్రూరుడు అయిన కైలాష్ లోనికి ఎంట్రీ ఇస్తాడు. అందరు కనిపిస్తున్నా యష్ వైఫ్ ఎక్కడ అంటాడు. ఆ సమయంలోనే వేద మొక్కలకు నీళ్లు పోస్తూ వుంటుంది.. తనని మాలిని పిలవడంతో హాలు లోకి వచ్చేస్తుంది. తనని చూసిన కైలాష్ లో రావణుడు బయటికి వచ్చేస్తాడు. వెంటనే వేద దగ్గరికి వెళ్లి చేయి పట్టుకుంటాడు. ఎంతో అందంగా వున్నావని ఓపెన్ గా చెప్పడంతో అంతా షాక్ అవుతారు. ఆ తరువాత మాట మార్చి సంప్రదయ బద్ధంగా వుందన్నానని చెబుతాడు.
ఆ తరువాత ఒంటరిగా వున్న వేద బెడ్రూమ్ లోకి వెళతాడు కైలాష్.. ఆ తరువాత ఏం జరిగింది? .. కైలాష్ వక్ర బుద్ధిని వేద పసిగట్టిందా? .. అసలు ఏం జరగబోతోంది?.. కథ ఎలాంటి మలుపులు తిరగబోతోంది? .. యష్ దాకా విషయం వెళితే పరిస్థితి ఎలా మారబోతోంది? అన్నది తెలియాలంటే ఈ రోజు ఎపిసోడ్ చూడాల్సిందే.