English | Telugu
జ్వాలని పెళ్లిచేసుకోవాలంటూ హిమ కండీషన్!
Updated : Jun 10, 2022
బుల్లితెరపై ప్రసారం అవుతున్న సీరియల్ `కార్తీక దీపం`. గత కొంత కాలంగా టాప్ రేటింగ్ తో ప్రసారం అవుతున్న ఈ సీరియల్ ఇటీవల కొంత క్రేజ్ ని కోల్పోయింది. కొత్త తరంతో మళ్లీ ట్రాక్ లోకి వచ్చిన ఈ సీరియల్ ఇప్పుడిప్పుడే గాడిలో పడుతోంది. ఈ నేపథ్యంలో ట్విస్ట్ లు, టర్న్ లతో సాగుతూ ఆకట్టుకుంటోంది. ఇక ఈ శుక్రవారం ఈ సీరియల్ ఎలాంటి మలుపులు తిరగబోతోంది? అన్నది ఇప్పడు చూద్దాం. హిమ తనకు క్యాన్సర్ అని చెప్పడంతో నిరుపమ్ ఒక్కసారిగా షాక్ కు గురవుతాడు. అమెరికాకు వెళ్లాలన్న తన ఆలోచనని విరమించుకుంటాడు.
ఇక ఈ రోజు ఎపిసోడ్ ప్రారంభంలో... ఓ పార్కులో కూర్చుని వున్న నిరుపమ్ .. హిమకు ఏం కాదని, తనని తాను రక్షించుకుంటానని ఆలోచిస్తుంటాడు. కట్ చేస్తే.. జ్వాల జ్యోతీష్యం చెప్పించుకుంటూ వుంటుంది. జ్వాల చేయి చూసిన జ్యోతీష్యుడు .. నీ చేయి చూస్తే మతిపోతోందమ్మా.. `అంటాడు. అదే సమయంలో అక్కడికి శోభ వస్తుంది. ఆఖరికి జాతకం చెప్పించుకుంటున్నావా? అంటూ ఎగతాలి చేస్తుంది. జ్యోతిష్యుడు ఎందుకు నీ జాతకం నేను చెబుతాను అంటూ మొదలు పెడుతుంది.
నీకు లైఫ్ వుండదు. లవ్వు వుండదు అంటుంది. ఆ మాటలు విన్న జ్యోతిష్యుడు తను చెప్పేవన్నీ అబద్ధాలని నీకు ఐశ్వర్యం లభిస్తుందని, లవ్ కూడా వుందని చెబుతాడు. వెంటనే జ్వాల.. ఆ మాటలు వింటుంటే నీ కడుపు మండుతోంది కదా` అని శోభకు కౌంటర్ ఇస్తుంది. కట్ చేస్తే...వేరే అమ్మాయిలో నువ్వు నా ప్రేమని చూసుకోవాలి బావ అని హిమ నిరుపమ్ తో అంటుంది. ఆ అమ్మాయి ఎవరంటాడు నిరుపమ్. ఇదే సమయంలో హిమ .. నిరుపమ్ నుంచి మాట తీసుకుని ఆ అమ్మాయి జ్వాల అంటుంది. ఆ తరువాత ఏం జరిగింది? నిరుపమ్ ఎలా రియాక్ట్ అయ్యాడు? అన్నది తెలియాలంటే ఈ రోజు ఎపిసోడ్ చూడాల్సిందే.