English | Telugu

యాంకర్ ఉంటారు కానీ యాంకరింగ్ ఉండదు

శ్రీదేవి డ్రామా కంపెనీ ప్రతీ వారం లాగే ఈవారం ఎపిసోడ్ బోనాల జాతర కూడా మస్త్ ఎంటర్టైన్ చేసేసింది. ఇక ఈ ఎపిసోడ్ లో మధుప్రియ తన ఫామిలీ మొత్తాన్ని తీసుకొస్తుంది. ఇక రష్మీ వచ్చి తన టీమ్ మొత్తాన్ని స్టేజి మీద పిలిచి ఈరోజు మనమంతా మధుప్రియ ఆహ్వానం మేరకు వాళ్ళ ఊరికి వచ్చాము. వాళ్ళ ఫామిలీ మొత్తాన్ని ఎంటర్టైన్ చేయాలి మనమే అని అంటుంది. ఇంతలో ఆది వచ్చి మధుప్రియ ఇంతకు మీ ఊరి స్పెషలిటీ ఏమిటి అని అడుగుతాడు ." వానలు పడకుండా పంటలు పండుతాయి, గేదలు లేకుండా పాలొస్తాయి.. మరి మీ స్పెషలిటీ ఏమిటి అని అడుగుతుంది" మా స్పెషలిటీ కూడా అంతే యాంకర్ ఉంటారు కానీ యాంకరింగ్ ఉండదు, కమెడియన్స్ ఉంటారు కానీ కామెడీ ఉండదు" అని అంటాడు.

రష్మీ ఇంత పెద్ద ఈవెంట్ చేస్తున్నావ్ కదా మరి నీ స్పెషాలిటీ ఏమిటి అని అడుగుతాడు.." ఇంత బాగా రెడీ ఐ వచ్చాగా అంటుంది రష్మీ ..ఇది కాదు "అప్పుడొక సాంగ్ పాడావ్ కదా ఆ సాంగ్ మళ్ళీ పాడొచ్చుగా అనేసరికి "ఎందుకో ఏకాంత వేళ ..ఊడితి ఊడితి" అంటుంది ఎం ఊడింది అంటాడు ఆది. వద్దులే నువ్వు పాడొద్దులే తల్లి పొరపాటున "ఏ శివరంజని రాగం ఇచ్చామనుకో దాన్ని ఎదో ఒకటి చేసేస్తావ్" అంటాడు. ఇక ఆది వీళ్ళ టీమ్ లో బాలయ్య, పవన్ డూప్స్ ఉంటారు. అలా ఆది ట్రేండింగ్ పంచులతో ఆడియెన్సు ని ఎంటర్టైన్ చేసాడు.