English | Telugu
గాజులు చేతులకు వేసుకోవాలి.. చెవులకు పెట్టుకోకూడదు!
Updated : Aug 3, 2022
అనసూయ స్మాల్ స్క్రీన్ పై ఫుల్ ఫేమస్ యాంకర్. అంతేకాదు ఆమె ఆల్‌రౌండర్ కూడా. ఈమె చేసే క్యారెక్టర్స్ చూస్తే ఈమె స్పెషాలిటీ ఏమిటో అర్థమైపోతుంది. ఐతే అనసూయ ఇటీవల జబర్దస్ షోకి బై బై చెప్పేసింది. కాగా లేటెస్ట్‌గా కొన్ని మూమెంట్స్ ని బీచ్ లో ఎంజాయ్ చేస్తూ కనిపించింది అనసూయ. పొట్టి నిక్కర్ వేసుకుని బీచ్ మొత్తాన్ని చుట్టేస్తోంది. అనసూయ ఎక్కడ ఉంటే అక్కడ అందం ఉంటుంది అన్నట్టుగా ఇప్పుడు బీచ్ కి వెళ్లి తన అందాన్ని సముద్రానికి కాస్త అంటించిందా లేదా సముద్రం అందాన్ని తానే కొంచెం పూసుకుందా అన్నట్టు ఉంది.
సముద్రం అందంగా ప్రవహిస్తుంటే అనసూయ చలాకీగా అల్లరి చేస్తోంది. "నన్ను చూసేసరికి సముద్రం ఎగసెగసి పడుతోంది. సముద్రం నన్ను మిస్సయిందేమో అనిపిస్తోంది" అన్నట్టుగా కాప్షన్ పెట్టి బీచ్ ఫొటోస్ తన ఇన్స్టాగ్రామ్ పేజీలో పోస్ట్ చేసింది. అందరూ సూపర్ అని కామెంట్ చేస్తుంటే ఒక నెటిజన్ మాత్రం "నైస్ చెడ్డి .. కొత్తదా" అంటూ ఒక సెటైరికల్ కామెంట్ చేసాడు.
అనసూయ పెట్టుకున్న చెవి పోగులు గాజుల్లా ఉండేసరికి మరో నెటిజన్ ఐతే "గాజులు చేతులకు వేసుకోవాలి కానీ చెవులకు పెట్టుకోకూడదు" అంటూ కామెంట్ చేసాడు. ఇక రంగమ్మత్త మాత్రం ఎప్పుడూ ఎవరి కామెంట్స్ కి రెస్పాండ్ అవదు. తన పని తాను చేసుకు పోతుంది. సినిమాల ఎంపిక విషయంలో ఆచి తూచి అడుగులు వేస్తోంది అనసూయ. రోల్ నచ్చి బోల్డ్ గా ఉంది అనుకుంటే తప్పనిసరిగా చేసేస్తుంది. సినిమా ఆఫర్స్ తో పాటు స్టార్ మాలో తనకు నచ్చిన ఆఫర్ వచ్చేసరికి అనసూయ జబర్దస్త్ కి గుడ్ బై చెప్పినట్లు తెలుస్తోంది.