English | Telugu

మోర్ రెమ్యూన‌రేష‌న్‌.. ఫుల్ ఫ్రీడమ్.. అందుకే షోని వీడిన అనసూయ!

జబర్దస్త్ నుంచి హోస్ట్ అనసూయ వెళ్ళిపోయింది. ఆమె ప్లేస్ లో కొత్త యాంకర్ కూడా రాబోతోంది. దీనికి సంబంధించి ప్రోమో కూడా రిలీజ్ అయ్యింది. అనసూయ స్టార్ మాలో జాయిన్ ఐన కారణంగా జబర్దస్త్ నుంచి తప్పుకున్నట్లు అధికారికంగా చెప్పింది. ఐతే ఇప్పుడు అనసూయ షో నుంచి వెళ్లిపోవడానికి తక్కువ పారితోషికం వల్లనే షోని వీడిందనే టాక్ వినిపిస్తోంది. ఎందుకంటే జబర్దస్త్ ఒక్క రోజు షోకి 3 లక్షల పారితోషికం వచ్చేది. స్టార్ మాలో ఇప్పుడు చేస్తున్నందుకు 5 లక్షలు ఇస్తున్నట్టు తెలుస్తోంది.

ఇక స్టార్ మాలో చేసే షోస్ కి డేట్ల విషయంలో అనసూయకి ఫుల్ ఫ్రీడమ్ ఉందట.ఆమె ఇష్టమైన సమయంలో వచ్చి షో చేసుకుని వెళ్లే అవకాశాన్ని కల్పించింది. ఇన్ని అవకాశాలు ఉండేసరికి అనసూయ జబర్దస్త్ ని వీడిందనే మరో టాక్ కూడా హల్చల్ చేస్తోంది. మొత్తానికి జబర్దస్త్ నుంచి కేవలం పారితోషికం కోసమే అనసూయ మారింది అంటూ సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది.

గతంలో తాను మూవీస్ లో నటించాలని అనుకుంది కాబట్టి జబర్దస్త్ ని వీడుతున్నట్లుగా ప్రకటించింది అనసూయ. ఐతే ఇప్పుడు అనసూయ అభిమానులు మాత్రం ఈ విషయమై చాలా నిరాశ వ్యక్తం చేస్తున్నారు. జబర్దస్త్ కి రెండు స్తంభాలైన అనసూయ, సుడిగాలి సుధీర్ వెళ్లిపోయారు. అనసూయ ఇక కనిపించదు కాబట్టి లేటెస్ట్ జబర్దస్త్ కి ఎవరు వస్తారు, రేటింగ్స్ ఎలా ఉంటాయో వేచి చూడాలి.

Karthika Deepam2: వైరాతో జ్యోత్స్న డీలింగ్.. కార్తీక్ కి డౌట్!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం 2'(Karthika Deepam2).ఈ సీరియల్ గురువారం నాటి ఎపిసోడ్ -544 లో.....శౌర్యకి దీప భోజనం తినిపిస్తుంది. అది చూసి కొడుకు కోడలితో చెల్లి మాట్లాడుతలేనట్లు ఉందని అనసూయ అంటుంది. వాళ్లే దాక్కొని తిరుగుతున్నారని కాంచన అంటుంది. శౌర్య వెంట భోజనం తినమని దీప పరుగెడుతుంది. శౌర్య అలా అమ్మని పరిగెత్తించవచ్చా.. ఇప్పుడు అమ్మ కడుపులో బేబీ ఉంది కదా తనకి ఆయాసం వస్తుంది ఇకనుండి నువ్వే భోజనం చెయ్యాలని కాంచన అనగానే.. నువ్వు మంచి నానమ్మవి కాదు నిన్ను తాతయ్య దగ్గరికి పంపించాలి.. మా అమ్మ నాకు తినిపించకుండా చేస్తున్నావని శౌర్య అంటుంది.

Illu illalu pillalu: ఇంగ్లీష్ టీచర్ గా శ్రీవల్లి.. ప్రేమ, నర్మద ప్లాన్ సూపర్!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'ఇల్లు ఇల్లాలు పిల్లలు'(Illu illalu pillalu ). ఈ సీరియల్ గురువారం నాటి ఎపిసోడ్ -345 లో... భాగ్యం, ఆనందరావు ఇద్దరు రామరాజు ఇంటికి శ్రీవల్లి డూప్లికేట్ సర్టిఫికేట్లు తీసుకొని వస్తారు. అవి ప్రేమ చూసి డూప్లికేట్ సర్టిఫికేట్లు అని చెప్పదు. ఇంకేంటి మావయ్య మీరు మీకు తెలిసిన కాలేజీ ప్రిన్సిపల్ కి ఫోన్ చెయ్యండి.. అక్క  ఇంగ్లీష్ టీచర్ గా జాయిన్ చెయ్యండి అని ప్రేమ అంటుంది. రామరాజు ఫోన్ చేస్తుంటే కావాలనే శ్రీవల్లి తుమ్ముతుంది. ఇప్పుడే వద్దు మావయ్య అంటుంది. అయినా రామరాజు వినకుండా ఫోన్ చేసి ప్రిన్సిపల్ తో మాట్లాడతాడు.