English | Telugu

హలో బ్రదర్ అంటున్న శ్రీముఖి

శ్రావణ మాసం మొదలయ్యింది అంటే చాలు ఎటు చూసినా పండగలు, పెళ్లిళ్లే సందడి చేస్తూ లేని హుషారును తెప్పిస్తాయి. ఇక ఈ శ్రావణమాసంలో వచ్చే రాఖీ పండగ కూడా అంతే ఆనందాన్ని అందిస్తుంది. అన్నలకు చెల్లెళ్ళు, తమ్ముళ్లకు అక్కలు రాఖీలు కట్టుకుని వాళ్ళ ఆశీర్వాదం తీసుకుంటారు. ఈ పండగ ఒక స్పెషల్ అని కూడా చెప్పొచ్చు. ఇక ఇప్పుడు బుల్లితెర మీద ఎటు చూసిన సీజనల్ ఈవెంట్స్ బాగా ఎంటర్టైన్ చేసేస్తున్నాయి. ఇదే నేపథ్యంలో ఇప్పుడు మల్లెమాల వాళ్ళు కూడా అటు జీ తెలుగు షోస్, ఇటు స్టార్ మా షోస్ తో సమానంగా ముందుకెళ్లేందుకు భారీగానే సన్నాహాలు చేస్తున్నట్లు కనిపిస్తోంది. రక్షా బంధన్ ని పురస్కరించుకుని "హలో బ్రదర్ "అనే షోని ప్లాన్ చేసింది.

ప్రతీ సంవత్సరం అన్నయ్యలు చెల్లెళ్లకు సర్ప్రైజ్ లు ఇవ్వడం చూసాం కానీ మొదటి సారి చెల్లెళ్ళు అన్నయ్యలకు సర్ప్రైజ్ ఇస్తే ఎలా ఉంటదో చూద్దామా అంటుంది శ్రీముఖి. ఇక వెనక స్టేజి మీద శ్రీముఖి నవీన్ చంద్రకి కుంకుమ పెట్టి రాఖీ కడుతుంది, రోల్ రైడా, భానుశ్రీ, హైపర్ ఆది, ఆటో రాంప్రసాద్ అందరూ కలిసి వాళ్ళ వాళ్లకు రాఖీలు కడతారు, కట్టించుకుంటారు. ఇలా రాబోయే ఎపిసోడ్ అంత ఫన్ అండ్ మస్తీతో ప్లాన్ చేసింది మల్లెమాల. ఇక ఈ షో ఈటీవీలో ఆగష్టు 7 న ఆదివారం రాత్రి 7 గంటలు ప్రసారం కాబోతోంది.

Podarillu : భూషణ్ మాటలు విని మహాని కొట్టిన ప్రతాప్.. తను ఏం చేయనుంది!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పోదరిల్లు'(Podarillu).ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -20 లో.....మీరు ఎవరికీ చెప్పకుండా పారిపోండి అని మహాకి చక్రి సలహా ఇస్తాడు. ఏం మాట్లాడుతున్నావ్ వాడికోసం మా నాన్న పరువు తియ్యాలా అని చక్రిపై మహా కోప్పడుతుంది. మహా తన గదిలోకి వెళ్లి.. మా నాన్న నన్ను చాలా బాగా చూసుకున్నాడు. అలాంటిది తనని మోసం చెయ్యలేనని మహా అనుకుంటుంది. అప్పుడే మహాకి భూషణ్ ఫోన్ చేస్తాడు. చిరాకుగా ఫోన్ పక్కన పెడుతుంది మహా. మళ్ళీ మళ్ళీ భూషణ్ ఫోన్ చేస్తుంటే ఫోన్ కట్ చేస్తుంది. ఏంటి నా ఫోన్ కట్ చేస్తుందా అని హారికకి ఫోన్ చేస్తాడు భూషణ్.