English | Telugu

మురారికి రిటర్న్ గిఫ్ట్ ఇచ్చిన కృష్ణ!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కృష్ణ ముకుంద మురారి'. ఈ సీరియల్ గురువారం నాటి ఎపిసోడ్ -94 లో.. మురారితో మాట్లాడుతుంటుంది ముకుంద. నీ అగ్రిమెంట్ భార్య ఈ మధ్య హద్దులు దాటుతుందని ముకుంద అనడంతో.. "హద్దులు అంటే ఏంటి" అని మురారి అడుగుతాడు. లిమిట్స్ అని ముకుంద చెప్తుంది. అవునా మరి లిమిట్స్ అంటే ఏంటి? మా శోభనం రోజున నువ్వు మా గది డోర్ కొట్టడమా అని మురారి అనేసరికి.. ముకుంద షాక్ అవుతుంది. "మాది అగ్రిమెంట్ మ్యారేజ్ కావచ్చు.. ఒకవేళ కృష్ణ వెళ్ళిపోయినా కూడా.. కృష్ణ నా భార్య అనే చెప్తాను. నేను తనకే సపోర్ట్ చేస్తాను" అని ముకుందకి వార్నింగ్ ఇస్తాడు మురారి...

వాసంతి కృష్ణన్ కి సర్ ప్రైజ్ ఇచ్చిన బిగ్ బాస్ ఫ్రెండ్స్!

బిగ్ బాస్ లో గ్లామర్ కి  కేర్ అఫ్ అడ్రెస్ గా నిలిచిన బ్యూటీ వాసంతి కృష్ణన్. బిగ్ బాస్ సీజన్-6 లో తన అందంతో ఆకట్టుకొని అభిమానులను సంపాదించుకుంది. బిగ్ బాస్ ఎంట్రీతో ఫేమ్ లోకి వచ్చిన ఈ గ్లామర్ క్వీన్ వరుస ఆఫర్స్ తో బిజీ అయిపోయింది. ప్రస్తుతం బీబీ జోడీలో అర్జున్ కి జంటగా వాసంతి చేస్తూ.. తన డాన్స్ తో ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. నిన్న జరిగిన వాసంతి పుట్టినరోజు వేడుకల్లో తనకి బిగ్ బాస్ కంటెస్టెంట్స్ సర్ ప్రైజ్ ఇచ్చారు. రాజ్, అర్జున్, రోహిత్ -మెరీనా, టైటిల్ విన్నర్ రేవంత్, శ్రీసత్య, కీర్తిభట్, గీతూ అందరు కలిసి మిడ్‌నైట్ వాసంతికి సర్ ప్రైజ్ ఇచ్చారు. అందరిని ఒక్కసారిగా చూసిన వాసంతి చాలా హ్యాపీగా ఫీల్ అయింది. ఫ్రెండ్స్ అంతా కలిసి ఆమెను బయటకు తీసుకురాగా.. కార్ డిక్కీ ఓపెన్ చేసేసరికి బెలూన్స్ అన్నీ కూడా పైకి ఎగురుతాయి. అప్పుడు అందరు హ్యాపీ బర్త్ డే వాసంతి అంటూ విషెస్ చెప్పారు.

పెళ్ళిమండపం నుండి స్వప్న జంప్.. బాధలో కనకం!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'. ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -32లో.. స్వప్న పెళ్ళికి రెడీ అవుతూ.. అందరినీ వదిలి వెళ్లిపోతున్నాననే బాధతో కావ్య, అప్పులను పట్టుకొని ఏడుస్తుంది. నువ్వేం భయపడకు అక్కా.. నీకు నచ్చిన అతన్ని పెళ్ళి చేసుకుంటున్నావ్ అని కావ్య  అంటుంది. అప్పు ఎలాగైనా బతికేస్తుంది.. నీ గురించే భయంగా ఉంది కావ్య.. చిన్నప్పటి నుండి నువ్వు మా కోసం కష్టపడుతున్నావని స్వప్న మనసులో అనుకుంటుంది. తను చీర మార్చుకుంటానని చెప్పి కావ్య, అప్పులను రూం నుండి బయటికి పంపించేసి.. స్వప్న వెనుక డోర్ నుండి పారిపోతుంది. అలా వెళ్ళేటప్పుడు వాళ్ళ పెద్దమ్మ నగలు, చీరలు అన్నింటిని తన లగేజ్ లో సర్దుకొని లెటర్ రాసిపెట్టి అక్కడి నుండి వెళ్ళిపోతుంది.