English | Telugu

యూట్యూబ్ వ్యూస్ కోసం అలాంటి పని చేసిన రాఘవ

జబర్దస్త్ ప్రతీ వారం సరికొత్తగా నవ్విస్తూ ఫుల్ మస్తీ చేస్తోంది. యూట్యూబ్ ఛానల్ లో సబ్జక్ట్స్ ఏమీ దొరక్క వ్యూస్ కోసం చాలా మంది చాలా రకాలుగా ట్రై చేస్తూ దొరికిన వాటినన్నిటినీ వీడియోస్ చేసి పోస్ట్ చేసేస్తున్నారు. దీన్నే కాన్సెప్ట్ గా తీసుకుని రాబోయే జబర్దస్త్ షోలో రాకెట్ రాఘవ ఒక స్కిట్ పెర్ఫార్మ్ చేసాడు. టీం లీడర్స్ అంతా లేడీ గెటప్స్ లో వచ్చి ఎంటర్టైన్ చేశారు. నెక్స్ట్ వీక్ జబర్దస్త్ ప్రోమో రీసెంట్ గా రిలీజ్ అయ్యింది.

ఇక రాకెట్ రాఘవ రావడమే "అహా నా పెళ్ళియంటా" సాంగ్ పాడుకుంటూ వచ్చాడు. "నా యూట్యూబ్ కి మంచి పేరు, వ్యూస్ రావాలని చెప్పి నేను పెళ్లి పీటల మీద నుంచి పారిపోయి వచ్చాను..ఆ అబ్బాయంటే నాకు ఇష్టం లేదు అనుకుంటున్నారేమో...వాడు చచ్చిపోతే నేను ఏడుస్తానో లేదో నాకు తెలీదు కానీ నేను ఏడిస్తే మాత్రం మాత్రం మా వాళ్ళు వాడిని చంపేస్తారు...మూతి మీద మీసం లేని మగాడా...చింపిరి జుట్టు మగాడా" అంటూ వెరైటీ డైలాగ్స్ తో స్కిట్ ని రక్తి కట్టించాడు. ఇక శాంతి స్వరూప్ లేడీ గెటప్ లో వచ్చి డైలాగ్ చెప్పి బాబోయ్ అనిపించాడు.." హలో బాస్మతి..కేజీ 60 ఒకటే బస్తా..ఆర్గానిక్ పిల్లా" అనేసరికి "అదేంటి హైబ్రిడ్ పిల్ల" కదా అని మరో కమెడియన్ అనేసరికి " నా ఒంట్లో ప్రతీది ఆర్గనిక్కే ఫ్రెష్షు" అన్నాడు శాంతిస్వరూప్. నూకరాజు, తాగుబోతు రమేష్, వెంకీ మంకీస్ అంతా నల్లా దగ్గర నీళ్లు పట్టుకుంటూ గొడవ పెట్టుకుంటారు. ఈ స్కిట్స్ అన్నీ కూడా వచ్చే వారం అలరించడానికి రాబోతున్నాయి.