English | Telugu

నిజంగా నువ్వు కుక్కవే... కన్నీళ్లు పెట్టుకున్న శ్రీసత్య

బిగ్ బాస్ లో ఉన్నంతకాలం అర్జున్ కళ్యాణ్ క్యారెక్టర్ చాలా డిఫరెంట్. కానీ బీబీ జాడీలో  మాత్రం తన మీద ఉన్న ఎన్నో నెగటివ్ కామెంట్స్ కి తెర దించేలా చేసాడు తన వెరైటీ డాన్స్ పెర్ఫార్మెన్సెస్ తో. తన జోడి వాసంతి కృష్ణన్ తో కలిసి వేరే లెవెల్ డాన్స్ చేస్తూ తన గ్రాఫ్ ని పెంచుకుంటున్నాడు. ఇక బీబీ జోడి నెక్స్ట్ వీక్ ప్రోమో రీసెంట్ గా రిలీజ్ అయ్యింది. ఇందులో అర్జున్ కళ్యాణ్ డాన్స్ కానీ ఎమోషన్స్ కానీ పీక్స్ అని చెప్పొచ్చు. కేరాఫ్ కంచరపాలెం మూవీలోని  "ఆశాపాశం" సాంగ్ ని ఎంచుకుంది ఈ జోడి. ఈ సాంగ్ లో భాగంగా కుక్కగా నటించాడు అర్జున్ కళ్యాణ్....

వసుధారని కౌగిలించుకొని మన మధ్య బంధం.. దూరం‌.. ఇదేనని చెప్పిన రిషి!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'గుప్పెడంత మనసు'. ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ -703 లో.. రిషి దగ్గరకి జగతి వెళ్ళి వసుధార గురించి మాట్లాడుతుంది. వసుధారకి ఇవ్వమని తాళిని నీతో నేనే పంపించాను. ఆ విషయం నీకు తెలియదు. ఆ తాళిని నువ్వు కట్టినట్టుగా భావించి తన మెడలో వేసుకుంది. వసుధారని అర్థం చేసుకోమని రిషీతో అంటుంది జగతి. నీ పర్మిషన్ లేకుండా మీడియా ముందు అలా చెప్పానని జగతి అనగానే.. "ఏం పర్లేదు మేడం. మీరు చేసింది తప్పని నేను అనట్లేదుగా" అని రిషి అంటాడు. నేను చెప్పింది తప్పు కానప్పుడు వసుధార చేసింది కూడా తప్పు కాదు కదా రిషి అని జగతి ప్రశ్నించగా.. కొన్ని తప్పులని క్షమించలేము అని రిషి సమాధానమిస్తాడు. అలా అనగానే కొన్ని  బాధలని అందరూ భరించలేరు.. దయచేసి నా పరిస్థితి  వసుధారకి రానివ్వకు రిషి అని జగతి అంటుంది. ఆ తర్వాత రిషి ఏం మాట్లాడకుండా అక్కడ నుండి వెళ్ళిపోతాడు.